కరోనా దెబ్బకు భారీగా నష్టపోయిన దేశాల్లో యూరోపియన్ దేశాలుగా చెప్పాలి. కరోనా ముందు వరకు ఏ చీకూ చింతా లేకుండా సాగిన అక్కడి వారికి.. కరోనాతో వచ్చి పడిన విపత్తును ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కాకపోవటం.. చూస్తుండగానే వేలాది మంది మరణించటం.. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాలు బలహీనం కావటమే కాదు.. కంటికి కనిపించని మహమ్మారి తమను ఎంతలా ప్రభావితం చేస్తుందన్న విషయం వారికి అనుభవంలోకి వచ్చింది.
తొలి రెండు దశలతో దారుణమైన అనుభవాల్ని పొందిన యూరోపియన్ దేశాల్లో తాజాగా మూడో దశ మొదలైందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. సెంట్రల్ యూరప్ లోని కొన్ని దేశాల్లో ఇప్పుడు ఆ ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొంటున్నారు. చెక్ రిపబ్లిక్.. పోలాండ్..స్లోవేకియా.. హంగేరీ దేశాలు పాత కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కరోనా మూడోదశతో తాము మరోసారి సంక్షోభంలోకి వెళుతున్నట్లుగా పోలండ్ ఆరోగ్య మంత్రి ఆడమ్ నిడెల్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటుందన్నది ఇట్టే చెప్పొచ్చు.
దీనికి తగ్గట్లే యూరోప్ లోని కొన్ని దేశాలు ఇప్పటికే కరోనా ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. చెక్ రిపబ్లిక్ రెండు రోజుల క్రితమే కఠినమైన ఆంక్షల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. స్లోవేకియాలోని ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్ట్రియా.. పోలండ్.. హంగరీలు తమ వైద్య సిబ్బందిని పంపుతున్నాయి. మొత్తంగా మహమ్మారి మూడో రూపం మొదలైనట్లేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీని ప్రభావం మరెలా ఉంటుందో?