కీలక పదవుల్లో ఉన్న వారెవరూ.. తమ పదవీ కాలం పూర్తి కావటానికి కాస్త ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఉంటారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే.. తన తర్వాత వచ్చే వారికి అలాంటి వాటి విషయంలో నిర్ణయం తీసుకోవటం ధర్మంగా భావిస్తారు. అలాంటిది అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత.. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వారు అవసరం లేకున్నా.. ఒక దేశం మీద దాడికి ప్లానింగ్ చేయటాన్ని అస్సలు ఊహించలేం. కానీ.. అలాంటి పాడు పని చేయటానికి ట్రంప్ ప్లాన్ చేశారా? అంటే అవునన్న సంచలన అంశం తాజాగా బయటకు వచ్చింది.
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ట్రంప్ తన అనూహ్యమైన నిర్ణయాన్ని కీలక అధికారులతో షేర్ చేసుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అమెరికాకు ప్రత్యర్థి దేశంగా ఉన్న ఇరాన్ పై దాడికి ఆయన ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇరాన్ లోని ప్రధాన అణుస్థావరంపై దాడికి ఉన్న మార్గాల్ని చెప్పాలని ఉన్నతస్థాయి సమావేశంలో ట్రంప్ కోరారట.
ఈ సంచలన అంశాల్ని తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే.. ట్రంప్ నిర్ణయాన్ని అధికారులు సమర్థించలేదట. ఇరాన్ దాడితో తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని..అలాంటి ఆలోచన సరికాదని చెప్పటంతో ట్రంప్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ సంచలన కథనంపై స్పందించేందుకు వైట్ హౌస్ నిరాకరించింది. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇరాన్ విషయంలో ట్రంప్ గుర్రుగా ఉండటం తెలిసిందే.
ఆ దేశంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్నిరద్దు చేసుకోవటంతో పాటు.. కఠినమైన వాణిజ్య ఆంక్షల్ని విధించారు. అణు ఒప్పందంలోని నిబంధనల్ని ఇరాన్ ఇటీవల అతిక్రమించినట్లుగా ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి స్పష్టం చేసిన వేళలోనే ఆ దేశం మీద దాడికి ఉన్నఅవకాశాల మీద ట్రంప్ ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అధికార బదిలీపై మరింత ఒత్తిడిని పెంచేందుకు బైడెన్ కు అవకాశం లభించినట్లుగా చెబుతున్నారు.