తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో పార్టీలు తెలంగాణ సాధనలో ఉన్నప్పటికీ రాష్ట్రం సాధించిన చాంపియన్‌గా నిలిచిన తీరే దీనికి ఉదాహరణ.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనలోనూ, రాజకీయ ఎత్తుగడల్లోనూ ఆయన అనుసరిస్తున్న వైఖరి కూడా ఈ కోణంలో ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, తాజాగా మళ్లీ కొత్త ఎత్తుగడను గులాబీ దళపతి ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు కేసీఆర్ అమలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే ఎపిసోడ్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభ వేదికగా ప్రకటించడం, దానిపై టీఆర్ఎస్ చోటా నేతల నుంచి మొదలుకొని ఢిల్లీలో ఎంపీలు ఆందోళన చేసే వరకు పరిస్థితి చేరిపోయింది. ఏకంగా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించేంత వరకు పరిస్థితి మారిపోయింది. అయితే, ఇదంతా లోలోపల జరుగుతున్న మైండ్ గేమ్ అని, కేసీఆర్ చాణక్య రీతి ఇందులో స్పష్టంగా ఉందని అంటున్నారు.
తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ ప్రధానిపై ప్రివిలెజ్ మోషన్ పేరుతో పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్ నోటీసులు ఇచ్చింది. కేంద్రం నుంచి క్లారిటీ వచ్చేంత వరకు హాజరయ్యేది లేదంటూ టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.
చివరకు ప్రతిపక్షాలను కూడా ఈ ఉచ్చులోకి లాగే డ్రామాలో రెండు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చి బడ్జెట్ సమావేశాలను బహిష్కరించింది. ఎలాగూ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తుండడంతో రెండు రోజుల బాయ్‌కాట్‌తో నిరసనను ఖతం అనిపించారు. స్థూలంగా ఒకరోజు ముందు పార్లమెంటు సమావేశాలు బాయ్ కాట్ చేసి తాము రాష్ట్రం కోసం గలం విప్పుతున్నట్లు కేసీఆర్ ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో కేసీఆర్ జనాల లాజికల్ థింకింగ్‌ను వ్యూహాత్మకంగా తప్పించారని అంటున్నారు.