చేపల వేట పేరిట సముద్రంలోకి వెళ్లే బోట్ల నిర్వాహకులు చేసేది డీజిల్ దొంగతనం.. కోట్లాది రూపాయల దందాకు పాల్పడుతున్నారు. కాకినాడ సముద్ర తీరంలో ఇప్పుడు ఆయిల్ మాఫియా వెనుక అధికారపార్టీ కీలక నేతల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విదేశీ నౌకలు, రిగ్గుల నుంచి కొట్టేసిన డీజిల్ ను ఒడ్డుకు తీసుకొచ్చి శ్రమ లేకుండా తిరిగి సముద్రంలో ఫిషింగ్ బోట్లకు విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రొయ్యల చెరువులు, పెట్రోల్ బంకులకు కూడా సరఫరా చేస్తూ యథేచ్ఛగా ఈ స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నట్టు తెలుస్తోంది.
కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొందరు ఈ మాఫియాను దర్జాగా నడిపిస్తున్నట్టు టాక్. కాకినాడలో రెండు ఓడరేవులు ఉన్నాయి. ఈ రెండింటికి 15 దేశాల నుంచి బియ్యం, సిమెంట్, యూరియా, గ్రానైట్ , కార్గో కోసం విదేవీ నౌకలు వచ్చిపోతుంటాయి. కాకినాడకు కొన్ని నాటికల్ మైళ్ల దూరంలో బెర్త్ కోసం కొన్ని రోజులు సముద్రంలో ఈ నౌకలు వేచి ఉంటాయి.
విదేశాల నుంచి వచ్చే నౌకల్లో లక్షల లీటర్ల డీజిల్ ఉంటుంది. రిజర్వ్ కూడా భారీగా ఉంటుంది. సముద్ర ప్రయాణంలో గాలివాటం ఆధారంగా ఈ నౌకలు భారీగా డీజిల్ మిగుల్చుకుంటాయి.
ఈ క్రమంలోనే విదేశీ నౌకలతో ఈ ఆయిల్ ముఠాలు బేరం కదుర్చుకొని ఆ డీజిల్ ను కొట్టేస్తున్నాయి. కాకినాడ బోట్లు ఈ నౌకల వద్దకు వెళ్లి మోటార్ల ద్వారా బోటులోకి డీజిల్ పంపింగ్ చేస్తారు. ఇలా డీజిల్ లీటర్ కు రూ.35 చొప్పున డాలర్ల రూపంలో చెల్లిస్తారు.
కాకినాడలో తిలక్ వీధిలో పేరుమోసిన కొందరు వ్యాపారుల నుంచి డాలర్లు సదరు మాఫియా ముఠాలకు అందుతాయని సమాచారం. అంతేకాదు కాకినాడ నుంచి బయలుదేరేముందు బోట్లలో కొన్ని ముఠాలు అమ్మాయిలను వెంట తీసుకువెళ్తున్నారు. ఇలా ఎర వేసి డీజిల్ పని కానిచ్చుకుంటారు.
ఇలా నౌకల నుంచి వారానికి ఏడు లక్షల లీటర్ల వరకు డీజిల్ ముఠాల చేతికి చిక్కుతోంది. మొత్తం ఆరు ఆయిల్ ముటాలు సముద్రంపై పట్టు సాధించాయి. గరిష్టంగా 30వేల లీటర్ల వరకు డీజిల్ కొట్టేస్తున్నారని సమాచారం. వారానికి లక్షన్నర లీటర్లు ఆయిల్ ముఠా సేకరిస్తున్నారు.వీరి నుంచి లీటరు రూ.42 నుంచి రూ.50చొప్పున కొనుగోలు చేస్తున్నాయి
అక్రమ డీజిల్ వ్యాపారం చట్టరీత్యా నేరం. పన్నులు చెల్లించకుండా సాగే ఈ నల్ల వ్యాపారం వల్ల ఖజానా ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రూ.35 కొన్న లీటర్ డీజిల్ ను రూ.65కు అమ్ముతున్నారు. ఫిషింగ్ బోట్లకు కల్తీ చేసి అమ్ముతున్నారు. మరింత లాభాలు గడిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.