వంగ‌వీటి రంగా - వంగ‌వీటి రాధాల రాజ‌కీయంలో ఎంత తేడా?!

Update: 2023-03-08 05:00 GMT
వంగ‌వీటి రాధా. విజ‌య‌వాడ‌కు చెందిన రంగా కుమారుడిగా ఆయ‌న‌కు మంచి పేరుంది. అయితే.. 2019 త‌ర్వాత నుంచి .. ఆమాట‌కొస్తే.. అస‌లు రాజ‌కీయాల్లోనే రాధా వేస్తున్న అడుగులు ఎవ‌రికీ కొరుకుడు ప‌డ డం లేదు. ఎవ‌రూ కూడా.. ఆయ‌న వేస్తున్న అడుగుల‌ను, తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను.. స‌మ‌ర్థించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే రంగాకు-రాధాకు రాజ‌కీయంగా ఉన్న వ్య‌త్యాసాన్ని.. ప‌రిణ‌త‌ను చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

"మంచైనా చెడైనా.. కాంగ్రెస్‌తోనే. టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా. పార్టీ మార‌ను" ఇదీ.. 1983 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వంగ‌వీటి రంగా చేసిన వ్యాఖ్య‌ల‌ని అప్ప‌టి వారు చెబుతారు.

ఎందుకంటే.. అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఏపీ కాంగ్రెస్‌.. రెండుగా చీలిపోయింది. రెడ్డి కాంగ్రెస్‌, ఇందిర‌మ్మ కాంగ్రెస్ అని చీలిపోయింది. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ కంకిపాడు నియోజ‌క‌వ‌ర్గం(ఇప్పుడు తూర్పు) నుంచి రంగా కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. దీంతో ఆయ‌న పార్టీ మారి.. క‌మ్యూనిస్టు జెండా క‌ప్పుకొంటార‌ని ప్ర‌చారం జ‌రిగిం దట‌. దీనిపైనే రంగా ఢిల్లీకి వెళ్లి.. ఇందిర‌మ్మ‌తో మాట్లాడి మ‌రీ టికెట్ తెచ్చుకున్నార‌ని అప్ప‌టి వారు చెబుతారు. ఇదీ.. రంగా రాజ‌కీయ నిబద్ధ‌త‌కు ద‌ర్ప‌ణ‌మ‌ని కూడా వారు వ్యాఖ్యానిస్తారు.

మ‌రి ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన వంగ‌వీటి రాధా ఏంచేస్తున్నారు? ఏ వ‌ర్గానికి ఆయ‌న చేరువవుతున్నారు?  అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. టీడీపీలో ఉన్న ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో భేటీ అవుతూ ఉంటారు. చంద్ర‌బాబు ఏదైనా కార్య‌క్ర‌మానికి పిలుపునిస్తే.. గ‌డ ప‌కూడా దాటి బ‌య‌ట‌కు రారు. యువ‌నాయ‌కుడిగా త‌న మెద‌డుకు ప‌దును పెట్టే కార్య‌క్ర‌మం ఒక్క‌టి కూడా చేయ‌లేదు.

అంతేకాదు.. రాధా పార్టీ మారుతున్నారంటూ.. ఆరేడు మాసాలుగా సోష‌ల్ మీడియా స‌హా.. ప్ర‌ధాన మీడియాలోనూ వార్త‌లు పుంఖాను పుంఖాలుగా వ‌స్తున్నాయి. దీనిపైనాఆయ‌న రియాక్ట్ కారు. పోనీ.. ఒకే పార్టీలో ఉంటున్నా.. ఇవ‌న్నీ పుట్టిస్తున్నార‌ని అందామా.. అంటే.. ఇప్ప‌టికి మూడు పార్టీలు(కాంగ్రెస్‌-ప్ర‌జారాజ్యం-వైసీపీ) మారారు. దీంతో కీల‌క‌మైన కాపు సామాజిక‌వ‌ర్గానికి ఆయ‌న చేరువ కాలేక పోతున్నార‌నే వాద‌న‌తోపాటు.. టీడీపీలోనూ "ఆయ‌న త‌ట‌స్థుడు" అనే మాట‌.. "నిక‌రం లేని నాయ‌కుడు" అనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News