శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం ఎచ్చెర్ల. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గొర్లె కిరణ్ కుమార్.. వైసీపీ తరఫున ఇక్కడ విజయం దక్కించుకున్నారు. నిజానికి ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు పట్టుకోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 1983 నుంచి 1999 వరకు కూడా.. ప్రతిభా భారతి.. ఇక్కడ టీడీపీ తరఫున వరుసగా విజయం దక్కించుకున్నారు. అయితే తర్వాత ఎచ్చెర్ల జనరల్ అయ్యి రాజం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆమెను అక్కడకు పంపేశారు. దీంతో ఇక్కడ పార్టీని బలోపేతం చేసేనాయకుడు కనిపించలేదు.
ఇంతలో ఇక్కడ కీలకంగా ఉన్నారనుకున్న మాజీ మంత్రి కళా వెంకట్రావు.. ప్రజారాజ్యంలోకి జంప్ చేయ డంతో కాంగ్రెస్ పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించు కుంది. 2014లో చంద్రబాబు హవా నేపథ్యంలో కళా వెంకట్రావు తిరిగి టీడీపీలోకి వచ్చి గెలిచారు. ఆ తర్వాత ఆయన మంత్రి అవ్వడంతో పాటు ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా అయ్యారు. ఆ తర్వాత ఆ పదవి అచ్చెన్నాయుడుకు వెళ్లింది. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కళా వెంకట్రావు బయటకు రాకపోవడంతో శ్రేణులు కూడా.. నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు... వైసీపీ తరఫున గెలిచిన కిరణ్ కుమార్ కూడా అభివృద్ధిలో వెనుకబడుతున్నారనే టాక్ వినిపి స్తోంది. నియోజకవర్గంలో ఆయనకు గత ఎన్నికలకు ముందు ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు లేదు. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుని పుంజుకునే స్కోప్ టీడీపీకి ఉన్నా కళా బయటకు రాకపోవడంతో పార్టీ పరిస్థితి దిగజారుతోంది. దీనిపై పలు చర్చలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వెంకట్రావుకు టికెట్ ఇవ్వబోరని.. కొందరు అంటుంటే.. ఖర్చుకు ఆయన వెనుకాడుతున్నారని.. మరికొందరు చెబుతున్నారు.
రాష్ట్రంలో టీడీపీ అనేక ఆందోళనలకు పిలుపు ఇస్తున్నా.. కూడా వెంకట్రావు పట్టించుకోవడం లేదని.. అంటున్నారు. కేవలం ప్రెస్ రిలీజ్ లు ఇచ్చి ఊరుకుంటున్నారని.. దీనివల్ల పార్టీలో ఉత్తేజం కనిపించ డం లేదని.. అంటున్నారు. పైగా ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఆయనకు ఉన్న గ్యాప్ కూడా కళా రాజకీయంగా వెనకబడేందుకు కారణమైంది.
మరో రెండేళ్ల వరకు ఇలానే ఉంటే.. పార్టీ ఇక్కడ పూర్తిగా.. ఇబ్బందుల్లో పడు తుందని చెబుతున్నారు. వైసీపీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పుంజుకునేందుకు అవకాశం ఉండి కూడా.. జారవిడుచుకుంటున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి సారిస్తుందో చూడాలి.