డిజిటల్ ఇండియా అని గర్వపడాలో.. ఎంత డిజిటల్ అయినా బిక్షగాళ్ల రహిత భారత్ సాధ్యం కాదని కన్ ఫాం చేసుకోవాలో తెలియదు కానీ... భిక్షాటన చేసే గిన్నెలో స్కానర్ ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. దీంతో... రకరకాల కామెంట్లు పెడుతున్నరు నెటిజన్లు.
భారతీయుల జీవన విధానం లాక్ డౌన్ కు ముందు లాక్ డౌన్ తర్వాత అన్నట్లుగా మారిపోయిందన్నా అతిశయోకి కాదేమో. కోవిడ్ అనంతరం చెల్లింపులు, షాపింగుల పద్దతి పూర్తిగా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే డిజిటల్ పేమెంట్లు ఎక్కువైపోయాయి. టీ తాగినా, బిస్కెట్ తిన్నా, ఆటో ఎక్కినా కూడా ఫోన్ చేతపట్టి ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్న రోజుల్లో ఇవి!
ఈ సమయంలో ఎవరిని అడిగినా చిల్లర లేదు, ఓన్లీ ఫోన్ పే, ఓన్లీ గూగుల్ పే అని అంటున్నారనో ఏమో కానీ... బిక్షగాడు కూడా ఒక స్కానర్ ని తాను బిక్షాటన చేసే గిన్నెలో స్కానర్ పెట్టుకుని రోడ్లపై వచ్చి పోయే వాహనాల దగ్గర బిక్షాటన చేస్తున్నాడు అంటూ ఈ పిక్ మాత్రం వైరల్ అవుతుంది.
అయితే ఇలాంటి డిజిటల్ బిచ్చగాళ్లకు సంబంధించిన విషయాలు ఆన్ లైన్ లో దర్శనమివ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో బీహార్ లోని బెట్టియా రైల్వే స్టేషన్ కు చెందిన రాజు పటేల్ అనే బిషగాడు డిజిటల్ గా మారాడంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
బిక్షాటన సమయంలో క్యూఆర్ కోడ్ స్కానర్ మెడలో వేసుకుని ఆన్ లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ అన్నట్లుగా తిరిగేవాడని సోషల్ మీడియా ఫోటోలు చక్కర్లు కొట్టేవి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదే సమయంలో తాజాగా ఒక వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో... లోకల్ రైలులో భారీ జనసందోహం మధ్య ఓ వ్యక్తి చేతిలో క్యూఆర్ కోడ్ తో పాట పాడుతూ అడుక్కుంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించినట్లు చెబుతున్నారు.
కాగా సంవత్సరానికి 90 మిలియన్ల లావాదేవీలతో ఆన్ లైన్ చెల్లింపు విషయంలో ప్రపంచంలో భారత్ మొదటి దేశంలో ఉన్న సంగతి తెలిసిందే!