ఇప్పటికీ పార్టీలో తుది నిర్ణయం ఆయనదే : దిగ్విజయ్ సింగ్

Update: 2020-08-26 16:00 GMT
కాంగ్రెస్...వందేళ్లకి పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలింది. అయితే, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పరిస్థితి మునుపటిలా లేదు. కాంగ్రెస్ లో చాలామంది ఉద్దండులు ఉన్నప్పటికీ వరుసగా రెండుసార్లు కేంద్రం లో అధికారంలోకి రాలేకపోవడం గమనార్హం. అయితే , రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత , తాత్కాలిక అధ్యక్ష పదివిలో సోనియా కొనసాగుతూ వస్తున్నారు. అయితే , తాజాగా సోనియా పై కాంగ్రెస్ సీనియర్ నేతలైన 23 మంది అసమ్మతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతూ, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. అలాగే ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగడానికి అందరు నేతలు ఒప్పుకున్నారు.

అయితే , కాంగ్రెస్ లో ఏర్పడిన ఈ అసమ్మతి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పార్టీలో చెలరేగిన అసమ్మతి ఇప్పటికిప్పుడే పుట్టిందేమీ కాదని, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమితులైనప్పుడే ఈ అసంతృప్తి చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. అధ్యక్ష బాధ్యతల్లో లేకపోయినా... ఇప్పటికీ రాహుల్ గాంధీ సైలెంట్‌గా చక్రం తిప్పుతూనే ఉంటారని, పార్టీ నియామకాల్లో ఆయనే తుది నిర్ణయమని డిగ్గీరాజా వెల్లడించారు. అధ్యక్ష బాధ్యతల్లో లేకపోయినా రాహుల్ అన్నీ తానై నడిపించడం సహించకనే సీనియర్లలో అసమ్మతికి కారణమని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News