న్యూ నిజాం అంటూ డిగ్గీ ఏసుకున్నాడు

Update: 2015-07-04 09:55 GMT
తెలంగాణ రాష్ట్ర అధికారపక్షంపై కాంగ్రెస్‌ అధినాయకత్వం దృష్టి సారించిందా? ఒక రాష్ట్రంలోని అంశాల మీద అధినాయకత్వంలో ఉన్న వారు చాలా అరుదుగా ప్రస్తావిస్తుంటారు. అలాంటిది.. తాజాగా కాంగ్రెస్‌ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితులైన దిగ్విజయ్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా చేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ట్వీట్స్‌తో ఏసుకునే ప్రయత్నం చేశారు.

ద న్యూస్‌ నిజామ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అంటూ ట్వీటిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి తాజాగా తన యాత్ర కోసం రూపొందించిన రూ.5కోట్ల బస్సు గురించి ప్రస్తావించారు. ఒక బస్సు కోసం రూ.5కోట్లు ఖర్చు చేయటం ఏమిటంటూ దిగ్విజయ్‌ సింగ్‌ విరుచుకుపడ్డారు. ఎన్నికల  సందర్భంగా ఇచ్చిన హామీల్ని సాకారం చేసుకోవటానికి నిధుల కొరత అని చెబుతున్న సర్కారు.. రూ.5కోట్ల బుల్లెట్‌ ఫ్రూప్‌ మెర్సిడెజ్‌ బెంజ్‌ బస్సు అవసరమా అంటూ చిరాకు పడిపోయారు.

మరోవైపు.. ఈ బస్సు తాజాగా అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే.. ఇందులోని ఏర్పాట్లు సంతృప్తికరంగా లేకపోవటంతో అసంతృప్తికి గురి అయిన కేసీఆర్‌.. బస్సును వెనక్కి పంపారు.

సీటింగ్‌ సౌకర్యవంతంగా లేకపోవటం.. సౌండ్‌ సిస్టం బాగా లేదని పేర్కొన్న ఆయన.. అందుకు తగ్గ మార్పులు చేయాలంటూ తిప్పి పంపారు. బెంజ్‌ వారు మర్చిపోయిన పాయింట్‌ ఏమిటంటే.. సదరు కొత్త బస్సు మీద ఆకుపచ్చ రంగు బదులు (డిజైన్‌) గులాబీ రంగు వేసి ఉంటే కేసీఆర్‌ మదిని కాస్తన్నా దోచుకునేవారేమో. మార్పులు.. చేర్పుల సమయంలో డిజైర్‌ కలర్‌ విషయం మీద కూడా కాస్త దృష్టి పెడితే బాగుంటుందేమో..!

Tags:    

Similar News