సూర్యకుమార్​ కు ఏం తక్కువ.. జట్టు ఎంపికపై వెంగ్ సర్కార్ ఫైర్

Update: 2020-10-28 10:10 GMT
ఆస్ట్రేలియా టూర్​కు .. బీసీసీఐ తుది జట్టును ఖరారు చేసిన విషయం తెలిసిందే.  దీంతో తుది జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు క్రికెట్​ అభిమానులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరును తప్పుబడుతున్నారు. రోహిత్​ శర్మను ఎందుకు పక్కకు పెట్టారో చెప్పాలంటే మాజీ క్రికెటర్​ సునీల్​ గవాస్కర్​ ఇప్పటికే ప్రశ్నించారు? అయితే తాజాగా ముంబై ఇండియన్స్​ టీం ఆటగాడు సూర్యకుమార్​ను ఎంపిక చేయకపోవడం పట్ల  మాజీ బీసీసీఐ సెలెక్టర్​ దిలీప్​ వెంగ్​ సర్కార్​, హర్బజన్​ సింగ్​ స్పిందించారు. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన ఇస్తూ .. ముంబై ఇండియన్స్​ జట్టుకు గెలిపిస్తున్న సూర్యకుమార్​ యాదవ్​ను పక్కన పెట్టడం అనాలోచితన నిర్ణయమని వారు పేర్కొటున్నారు. మరోవైపు ఈ విషయంలో సోషల్​మీడియాలో తీవ్ర దుమారం రేగుతున్నది. సూర్యకుమార్​ పేరు ప్రస్తుతం ట్విట్టర్​లో మారు మోగుతున్నది. ఆస్ట్రేలియా టూర్ ​కు భారత జట్టు ఎంపికైన విషయం తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్​ కమిటీ టెస్టులు, వన్డేలు, టీ20లకు జట్లను ఎంపిక చేసింది. ఐపీఎల్​2020లో గాయపడ్డ స్టార్​ ఒపెనర్ కు రోహిత్​ శర్మ, సీనియర్​ పేసర్లు ఇషాంత్​ శర్మ, భువనేశ్వర్​ కుమార్​ల కు జట్టు లో చోటు దక్కలేదు.

 ఐపీఎల్​లో రాణిస్తున్న కోల్​కతా నైటర్​రైడర్స్​ స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి టీ20 ఫార్మాట్​లో చోటు దక్కించుకున్నాడు. ఫామ్​ నిరూపించుకున్న రాజస్థాన్​ రాయల్స్​ యువ బ్యాట్స్​మెన్​ సంజు శాంసన్​ తిరిగి భారత జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ముంబై ఇండియన్స్​ అద్భుతంగా రాణిస్తున్న బ్యాట్స్​మెన్​ సూర్యకుమార్​ యాదవ్​ను సెలెక్టర్లు పట్టించుకోలేదు దీనిపై తీవ్ర దుమారం రేగుతున్నది. ఐపీఎల్​ 2020లో ముంబై ఇండియన్స్​ తరఫున 11 మ్యాచులు ఆడిన సూర్యకుమార్​ యాదవర్​ 31.44 యావరేజ్​, 148.94 స్ట్రయిక్​ రేట్​ తో 283పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్​సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్​ 79 నాటౌట్​.. మొత్తంగా 196 ఐపీఎల్​ మ్యాచులు ఆడిన సూర్య 1831 పరుగులు చేశారు. వరుణ్​ చక్రవర్తికి అవకాశం ఇచ్చిన బీసీసీఐ సెలక్టర్లు సూర్యకుమార్​ యాదవ్​ కు మాత్రం చాన్స్​ ఇవ్వక పోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 ఈ విషయంపై టీమిండియా వెటరన్​ ఆఫ్​ స్పిన్నర్​ హర్బజన్​ సింగ్​ కూడా ట్విట్టర్​ వేదికగా బీసీసీఐపై సెటైర్లు వేశాడు. ఒక్కొక్కరికి  ఓక్కో రూల్​ అంటూ మండిపడ్డారు. బీసీసీఐ సెలక్ర్ అతడి రికార్డులను ఓసారి చూడాలి అంటూ ట్వీట్​ చేశాడు.  మాజీ బీసీసీఐ సెలెక్టర్​ దిలీప్​ వెంగ్​ సర్కార్​ కూడా బీసీసీఐ సెలక్టర్​ తీరును తప్పుపట్టాడు. ఓ అద్భుతమైన ఆటగాడిని బీసీసీఐ పక్కన పెట్టిందని విమర్శించాడు. ‘ బీసీసీఐ నిర్ణయంతో నేను చాలా ఆశ్చర్యపోయాను. అద్భుతంగా బ్యాటింగ్​ చేస్తున్న ఓ క్రికెటర్ ​ను ఎలా పక్కన పెడతారు? రోహిత్ శర్మను తీసుకోలేదు. ఇప్పుడు టీం ఇండియాకు ఓ బలమైన బ్యాట్స్​మెన్​ కావాలి. మిడిల్​ ఆర్డర్​ స్ట్రాంగ్​ గా ఉండాలి. అటువంటప్పుడు ఫామ్​ లో ఉన్న ఓ క్రికెటర్​ ను పక్కన పెట్టడం సరికాదు. ఈ విషయం లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సెలెక్టర్లను ప్రశ్నించాలి ' అంటూ వెంట్​ సర్కార్​  వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News