ఆస్ట్రాజెనెకాకు సూటి వార్నింగ్.. మాకు ఇవ్వకుండా వేరే వారికి ఇస్తారా?

Update: 2021-03-21 04:48 GMT
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా అంతకంతకూ చెలరేగిపోతంది. ప్రస్తుతం దేశంలో రెండో వేవ్ విరుచుకుపడుతుంటే.. యూరోపియన్ దేశాల్లో మూడో వేవ్ అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో.. ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇలాంటివేళ.. తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ సరఫరా చేయని ఆస్ట్రాజెనెకా సంస్థపై యూరోపియన్ యూనియర్ చీఫ్ ఉర్సులా వొన్ డెర్ లెయెన్ హెచ్చరించారు.

తొలుత తమ కూటమికి వ్యాక్సిన్లు ఇవ్వాలని.. ఆ తర్వాతే ఎగుమతులని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం అడ్డుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 90 శాతం వ్యాక్సిన్ డోసులు ఇస్తామని చెప్పిన ఆస్ట్రాజెనెకా.. తీరా 30 శాతం మాత్రమే ఇవ్వటాన్ని తప్పు పట్టారు.

ఇదిలా ఉంటే.. ఈయూ ప్లాంట్లలో వ్యాక్సిన్ తయారీ ఆలస్యమవుతుందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. దీంతో.. తాము మాట ఇచ్చిన దాని ప్రకారం వ్యాక్సిన్లు సరఫరా చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా వ్యాక్సిన్ తయారీ దారుకు ఈయూ చీఫ్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News