ఆంధ్రా.. తెలంగాణ.. రెండు ఒక్కటే అని చాలామంది అనొచ్చు. కానీ.. ఈ రెండు ప్రాంతాలకు చెందిన ప్రజల ఆలోచనా తీరు.. చైతన్యం.. వివిధ అంశాలపై వారు స్పందించే విధానం.. ప్రముఖల స్వేచ్ఛాప్రియత్వం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని తేడాలు ఉంటాయి. చలనచిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులున్నఒక ప్రముఖుడు.. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. బహిరంగ లేఖ రాసేందుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన చిత్ర ప్రముఖుడు చేస్తాడా? అంటే సందేహమే. అదే సమయంలో.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. ప్రభుత్వంపై ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు అస్సలు వెనుకాడరు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువన్న మాట వినిపిస్తోంది.
ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు. తాజాగా ఆయన కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బహిరంగ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తున్నారని.. ఎనిమిదేళ్లుగా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారు. "పెనం మీది నుంచి పొయ్యిలోకి'' అన్న పేరుతో విడుదల చేసిన లేఖను యథాతధంగా చూస్తే..
''నేను డాక్టర్ తో మాట్లాడాలనుకున్నాను. కానీ ఫోనులో మాట్లాడలేని పరిస్థితి! నా జన్మదినం నాడు నా మిత్రుడు నాకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. కానీ, ఫోనులో వినరాని పరిస్థితి! నా సోదరుడు నాకో విషాదవార్త చెప్పాలనుకున్నాడు. కానీ, అతడు చెప్పేది నేను ఫోనులో వినలేని పరిస్థితి! ఒక పెద్దాయన మా ఇంటికి రావాలనుకున్నాడు. అతను ఆ విషయాన్ని ఫోనులో చెపుతుంటే నేను వినలేని పరిస్థితి! తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య ఆధునిక హంగులతో నిర్మించిన "ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్" నుండే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తన పర్యవేక్షణలన్నీ కొనసాగిస్తున్నది. వారికెందుకో నేనుకూడా టార్గెట్ గా మారాను. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా దాన్ని అడ్డుకోవడం, లేకుంటే అవతలివాళ్ళు మాట్లాడేది నాకు వినబడకుండా చేయడం, వాళ్ళకు దినచర్య అయింది''
''2014 నుండి నా ఫోన్ టాపింగ్ కు గురి అయినా, ప్రత్యేకంగా 2018 జనవరి నుండి నా ఫోన్ కాల్స్ ను వాళ్లు అడ్డుకోవడం ప్రారంభించారు. గత ఐదున్నర సంవత్సరాల నుండి నాకు నరకం చూపిస్తున్నారు. ఈ లోకంతో నా సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచి వేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని వాట్స్ఆప్ మెసేజ్ ల ద్వారా, అలాగే ఒకటి-రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసి కెటిఆర్ కు నా ఆవేదనను తెలుపుకున్నాను. ఆయన నా ముందు కొన్ని తీపి కబుర్లు చెప్పి, వెనుక తన నాటకాలను కొనసాగిస్తూనే ఉన్నాడు.
గత ఐదున్నర యేళ్లుగా నేనెక్కడికి వెళ్లలేని, ఏమీ చెయ్యలేని పరిస్థితికి నన్ను గురి చేస్తూనే ఉన్నారు. అయినా దాన్నంతా నేను నిశ్శబ్దంగానే భరించాను. ఈ విధంగా వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకెంతకూ అర్ధం కావడం లేదు. నేను గత 60 సంవత్సరాలుగా తెలంగాణా సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న్నాను. వందలాది మంది కళాకారులతో సామాజిక అభ్యున్నతి కొరకు జరిగే అనేకానేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. వాటిని చిత్రీకరించే, అక్షరబద్దం చేసే ప్రయత్నం చేశాను, ఇంకనూ చేస్తూనే ఉన్నాను.
నా సాంస్కృతిక రంగం, సినిమా రంగ కార్యక్రమాలు సమాజ పురోగతికి, తెలంగాణా విమోచనకు తోడ్పడ్డాయే గాని, మరోరకంగా కాదు. ఆంధ్ర పాలకులుకూడా నన్ను ఏనాడూ, ఏ రకంగానూ నిలువరించలేదు. నేటి మన తెలంగాణ పాలకులు మాత్రం నన్ను ఇంత దారుణంగా మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, కాలర్ ఎగర వేస్తున్నారు. నిజాన్ని అబద్దంగా, అబద్దాన్ని నిజంగా నమ్మబలికేలా చూపెట్టే గుప్పెడు మంది ఇంద్రజాలికులను తనచుట్టూ ఒక కోటరీగా ఏర్పాటు చేసుకుని తెలంగాణా ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది ఈ ప్రభుత్వం. నిత్యం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ, ఆత్మగౌరావాన్ని అంగటి సరుకుగా మార్చి, తమని ధిక్కరించిన ప్రతివాన్ని పావలాకు ఆఠానాకు కొనేసి, తన గడీలచుట్టూ పహారా కాసే కాపలా కుక్కలుగా నియమించ చూస్తున్నది. కాదన్న నాలాంటి వారిపై ఇలాంటి దాష్టికాలకు ఒడిగడుతున్నదీ ప్రభుత్వం.
తెలంగాణ వచ్చిందన్న సంతోషం ఏమోగానీ, నాకు మాత్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, ముఖ్యంగా 2018 నుండి అన్ని రాత్రులూ అమావాస్య రాత్రులే! ఒక ప్రముఖుడిగా నా పరిస్థితే ఇలా వుంటే, తెలంగాణాలో సామాన్యుడి గతి ఏమవుతుంది?'' అంటూ నరసింగరావు బహిరంగ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.