పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను జనాలు ఇప్పటికీ పార్ట్ టైం రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు. పార్టీ పెట్టి మూడేళ్లు దాటుతున్నా పవన్ కార్యక్షేత్రంలోకి దిగిన సందర్భాలు చాలా తక్కువ. ఔట్ డేట్ అయిపోయిన విషయాల మీద ట్విట్టర్లో తన అభిప్రాయం చెప్పడం మినహాయిస్తే.. నేరుగా గ్రౌండ్లోకి దిగి రియాలిటీని చూడడని.. ప్రకటనలు ఇవ్వడం తప్ప ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేసేది తక్కువని పవన్ మీద విమర్శలున్నాయి. ఐతే ఈ మధ్య ట్విట్టర్లో కొంచెం యాక్టివ్ అయి.. రోజూ ఏదో ఒక ప్రకటన మాత్రం ఇస్తున్నాడు పవన్. ఇలా ట్విట్టర్లో యాక్టివ్ అయితే ఏం ప్రయోజనమని.. సమస్యలపై నేరుగా ఎప్పుడు స్పందిస్తాడని పవన్ ను నిలదీస్తున్నారు జనాలు.
ఇలాంటి తరుణంలో ఓ పత్రికా కార్యాయలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. అక్కడికెళ్లి సిబ్బందిని పరామర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్న ఏర్పేడులో అంత పెద్ద ప్రమాదం జరిగి 15 మంది దాకా ప్రాణాలు కోల్పోతే పవన్ అక్కడికి వెళ్లలేదు. అంతకుముందు విజయవాడలో బస్సు ప్రమాదం చోటు చేసుకున్నపుడు.. అనంతపురంలో చెరువులో మునిగి కొందరు చనిపోయినపుడు.. ఇలాంటి సందర్భాలన్నింటిలో కంటితుడుపుగా ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన ఇచ్చి ఊరుకున్నాడు పవన్. ఐతే ఓ పత్రికా కార్యాలయంలో ఏ ప్రాణ నష్టం జరగని ప్రమాదం మీద ఆందోళనతో అక్కడికెళ్లి సిబ్బందిని పరామర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని జనాలు పవన్ ను నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషాద ఘటనలకు సంబంధించి నేరుగా వెళ్లి బాధితుల్ని పరామర్శించి ఉంటే.. ఆ కుటుంబాలకు అంతో ఇంతో ఊరటగా ఉండేది. చేతనైన సాయం చేసినా బాగుండేది. ఐతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అలాంటి పనులు మాత్రం పవన్ చేయడని.. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలిచే పత్రిక కార్యాలయంలో ప్రమాదం జరిగితే.. ఠంచనుగా వెళ్లి పరామర్శిస్తాడని.. దీన్ని బట్టే పవన్ విశ్వసనీయత ఏంటో అర్థమవుతోందని జనాలు విమర్శిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/