నామినేషన్ కి డబుల్ డోసు వేసుకోవాల్సిందే...

Update: 2021-10-06 07:46 GMT
హుజురాబాద్ అసెంబ్లీ కి జరుగుతున్న ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్ గా ప్రధాన పార్టీలు భావిస్తుండటంతో ఈ ఎన్నికలో విజయం అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకొని ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నా యి . జూన్ నుంచే హుజురాబాద్ ప్రచార జాతర కొనసాగుతుండగా.. ఎన్నికల నోటిఫికేషన్అ నంతరం నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో టీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను రంగంలో దించేందుకు సిద్ధమైంది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు ఉండనున్నాయి. అధిక నామినేషన్లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలనుకుంటున్న నిరుద్యోగులతో పాటు ఇతర వర్గాల వారికి ఎన్నికల కమిషన్ అధికారులు కోవిడ్ నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు.

దీంతో అభ్యర్థులు నామినేషన్ వేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్ , వేయకుండానే అసహనంగా వెనుదిరిగేటట్టుగా పరిస్థితులను కల్పించే విధంగా స్థానిక పోలీసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్న వారికి కోవిడ్ నిబంధనలు అడ్డుగా మారుతున్నాయి. దీంతో పాటు స్థానిక పోలీసులు అధికారులు సైతం నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో పడకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

నిబంధనల పేరుతో అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం నామినేషన్ వేయడానికి వెళుతున్న అభ్యర్థులను కోవిడ్ టీకా సర్టిఫికెట్స్ లేవనే నిబంధనతో పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున నామినేషన్ వేయాలని నిర్ణయించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్‌ ను అడ్డుకునేందుకు కూడా పోలీసులు మోహరించారు. దీంతో నిబంధనలు పాటించడం లేదంటూ నిన్న కొద్ది మంది ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను కూడ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా నామినేషన్ వేసేందుకు వెళుతున్న 16 మంది అభ్యర్థులను వెనక్కి పంపారు. మొత్తం పదహారు మందిలో 6 అభ్యర్ధులకు సైతం కరోనా టీకా సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపగా మరో పదిమందికి మాత్రం వారిని బలపరిచే వారికి కూడా కరోనా టీకా సర్టిఫికెట్ లేదంటూ వెనక్కి పంపారు. దీంతో ఆ పదిమంది కూడా నామినేషన్ వేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు.

దీంతో పాటు కనీసం నామినేషన్ పత్రాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. పత్రాల పేరుతో గంటల తరబడి వేయిట్ చేయించి చివరకు ఫామ్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్‌ సైట్‌ నుండే డౌన్‌ లోడ్ చేసుకోవాలని పంపించారు. ఇలా అనేక నిబంధనలతో పాటు అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయడంతో అధికారులతో వాగ్వావాదానికి దిగారు. మొత్తం మీద నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వేయకుండా దీనివెనక వ్యుహం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. కాగా నిజామాబాద్ ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున పసుపు రైతులు నామినేషన్ వేసి అధికార పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతో ప్రస్తుతం అలాంటి పరిణామాల నుండి బయటపడేందుకు అధికార టీఆర్ ఎస్, వ్యుహాలు రిచిస్తుందని పలువురు అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు.



Tags:    

Similar News