బ్రేకింగ్ న్యూస్‌!!! అప్పుడే అస‌మ్మ‌తి వైసీపీ ఎమ్మెల్యేలు.. బెంగ‌ళూరులో స‌మావేశం

Update: 2022-04-05 06:40 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో క‌ట్టుబాటు క‌నిపించ‌డం లేదు. 'మ‌నంద‌రి' ప్ర‌భుత్వం అని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ చెబుతున్నా.. వైసీపీ నాయ‌కులు కొంద‌రు ఇది 'కొంద‌రి ప్ర‌భుత్వ‌మేన‌ని' బాహాటంగా అంటు న్నారు. పైగా త‌మ‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింద‌ని.. పోతోంద‌ని కూడా చెబుతున్నారు. ఈ ప‌రిణా మాలు వైసీపీలో తీవ్ర చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. పైగా.. ఇప్పుడు మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేస్తున్న నేప థ్యంలో ఎమ్మెల్యేలు.. మ‌రింత‌గా ర‌గిలిపోతున్నారు. మాకు ఎలాంటి గుర్తింపు లేదా?  ఉండ‌దా? అంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు.

''వైసీపీ పుట్టినప్ప‌టి నుంచి ఈ పార్టీలోనే ఉన్నాం. జ‌గ‌న్ జైలుకు వెళ్లిన‌ప్పుడు.. పార్టీ ఉంటుందా? ఉండ దా? అనే చ‌ర్చ వ‌చ్చి.. అనేక మంది నాయ‌కులు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. కానీ, మా లాంటి వాళ్లం పార్టీని బ‌తికించాం. పాద‌యాత్ర‌లు చేశాం. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఢీ అంటే ఢీ అని ప్ర‌త్య‌ర్థుల‌తో పోరాడి .. పార్టీని నిల‌బెట్టాం. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని.. క‌ల‌లు క‌న్నాం. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యా రు. దీంతో మాకు కూడా గుర్తింపు ఉంటుంద‌ని అనుకున్నాం. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని ఆశించాం. కానీ.. ఏం లాభం లేదు. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అంటూ.. మా ఆశ‌లు అడియాస‌లు అయ్యాయి'' ఇదీ.. ఒక కీల‌క నాయ‌కుడు.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా ఉమ్మ‌డి క‌డ‌ప‌లోని వైఎస్సార్ జిల్లాకు చెందిన నేత‌.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చేసిన వ్యాఖ్య‌లు.

ఈయ‌న ఒక్క‌రే కాదు.. ఇలాంటి వారు  చాలా మంది ఉన్నారు. గ‌త కేబినెట్లోనే త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కు తుంద‌ని.. వారు ఆశించారు. అయితే.. ద‌క్క‌లేదు. దీంతో ఇప్పుడైనా.. విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. కానీ, తాజాగా వెలువ‌డుతున్న సంకేతాల‌ను బ‌ట్టి.. కొత్త‌వారికి.. ఎక్కువ ప్రాధాన్యం వ‌స్తున్న‌ట్టు తెలియ‌డంతో.. కొంద‌రు నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. దీంతో జ‌గ‌న్ కేబినెట్ మార్పు రాజ‌కీయంగా సొంత పార్టీలోనే పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

వైసీపీకి అత్యంత కీల‌క‌మైన ఒక మంత్రి ఆధ్వ‌ర్యంలో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు బెంగ‌ళూరులో అత్యంత ర‌హ‌స్యంగా స‌మావేశం పెట్టారు. వాస్త‌వానికి కొత్త జిల్లాల ఏర్పాటు నేప‌థ్యంలో సోమ‌వారం అంద‌రు నేత‌లు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోఅందుబాటులో ఉన్నారు. కానీ, ఈయ‌న మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. ఆయ‌న బెంగ‌ళూరులో మ‌కాం వేసి.. కొంద‌రు ఎమ్మెల్యేలు, త‌న మ‌ద్ద‌తు దారుల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు.. పెద్ద ఎత్తున వైసీపీలోనే గుస‌గుస వినిపిస్తోంది.

ఒక‌వేళ త‌న‌కు మంత్రివ‌ర్గంలో మ‌ళ్లీ అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే.. తానుచెప్పిన వాళ్ల‌కు అయినా.. మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నేది.. స‌ద‌రు మంత్రి డిమాండ్‌ గా వినిపిస్తోంది ఆయ‌న వెంట నాలుగు సామాజి వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు తెలిసింది. వీరితో భేటీ అయి.. ర‌హ్యంగా మీటింగ్ పెట్టిన‌.. స‌ద‌రు మంత్రి.. కేబినెట్ కూర్పు విష‌యంలో .. ఈసారి రాజీప‌డేదిలేద‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే..  ఇంకొంద‌రు తొంద‌ర‌లోనే.. ఇలాంటి క్యాంపు రాజ‌కీయాలుచేసి.. త‌మ డిమాండ్ల సాధ‌న‌కు న‌డుం బిగించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు.. వైసీపీలోని సీనియ‌ర్లు.. ఆది నుంచి పార్టీ కోసం ప‌నిచేసిన‌వారు.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు త్యాగం చేసిన వారు.. ఇంకొన్ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యేల సామాజిక వ‌ర్గాల ఆధారంగా మంత్రి ప‌దవులు ఇచ్చుకుంటూ.. పోతే.. జీవితంలో తాము ఎప్పుడు.. మంత్రులు కాలేం అని నిట్టూర్పులు విడుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంకెందుకు.. ఈ పార్టీలో ఎమ్మెల్యే అయింది? అని ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నా రు. కొత్త‌గా ఎమ్మెల్యే అయి,... లాట‌రీలో ఎమ్మెల్యే అయి.. జ‌గ‌న్ సునామీలో కొట్టుకు వ‌చ్చిన వారికి, నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ప్ర‌జ‌ల‌కు పేరు కూడా తెలియ‌నివారికి.. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇస్తే ఎలా అంటున్నారు.

అంతేకాదు.. ఇలాంటి వారికి ఇచ్చేసి.. చేతులు దులుపుకొంటే.. మా రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటి? అని పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ప‌రిణామం.. వైసీపీలో పెను ఉద్రిక్త‌త‌ల‌కు దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పుడైనా.. జ‌గ‌న్ ఆచితూచి అడుగులు వేస్తారా?  లేదా? అనేది చూడాలి.
Tags:    

Similar News