లోన్ తీసుకున్న వారికీ తీపికబురు చెప్పిన సుప్రీం !

Update: 2020-09-04 13:00 GMT
లోన్స్ తీసుకోని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో తీసుకున్న లోన్స్ కి ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీపికబురు అందించింది. రాబోయే రెండు నెలల వరకు ఏ బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31 లోగా ఎన్ ‌పీఏ వర్గీకరణలోకి రాని ఖాతాలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్లకు ఊరట కల్పించేందుకు ప్రకటించిన లోన మారటోరియం సమయంలో కూడా బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారణకు తీసుకున్న జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆగస్టు 31 వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించని ఖాతాలు వేటినీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దు’’ అని జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షా సభ్యులుగా గల డివిజన్‌ బెంచ్‌ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రస్తుతం ‘ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ’’, ‘‘ప్రతి ఒక్క రంగం’’ తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నాయన్న విషయం గుర్తు చేశారు. కరోనాను అరికట్టడంలో భాగంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ సుమారుగా రెండు నెలలకి పైగా సంపూర్ణంగా కొనసాగింది. దీనితో చాలా పరిశ్రమలు మూతబడ్డాయి. చాలామంది ఉపాధి , ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో లోన్లు తీసుకున్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈఎంఐలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకున్న వారి కోసం ఈఎంఐ మారటోరియం సదుపాయాన్నికేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆగస్ట్ నెల చివరితోనే ఈ మారటోరియం గడువు ముగియనుంది. ఇప్పుడు మళ్లీ ఈఎంఐలు కట్టాల్సిందే. ప్రభుత్వం పూర్తిగా లాక్ డైన్ ఎత్తివేసినా ఇంకా ఉపాధి దొరకని పరిస్థితి వుంది. చాలా మందికి ఉద్యోగాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈఎంఐలు చెల్లించడం చాలా కష్టం. అయితే ఇలాంటి వారికి సుప్రీం కోర్టు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాలుగా ప్రకటించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇకపోతే ఈ కేసుపై సెప్టెంబర్ 10న మరోసారి వాదనలు జరగనున్నాయి లోన్ ఈఎంఐ డబ్బులు వరుసగా 90 రోజులపాటు చెల్లించకపోతే అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటిస్తారు. ఇకపోతే , కరోనాతో అనుసంధానమైన ఒత్తిడిని తగ్గించడానికి, మారటోరియం ఎత్తివేసిన అనంతరం రుణగ్రహీతలకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి బ్యాంకులు, ఎన్‌ బీ ఎఫ్ సీలు ఈ నెల 15 లోగా రుణ పునర్‌ వ్యవస్థీకరణ స్కీమ్ ‌ను ప్రకటించాలని, దాని గురించిన అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. గురువారం షెడ్యూల్డు బ్యాంకులు, ఎన్‌ బీ ఎఫ్ సీల అధిపతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సమావేశం నిర్వహించారు. ఈ ఎం ఐ వాయిదాలపై ప్రకటించిన మారటోరియం గడువు సమయం ఆగస్టు 31వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
Tags:    

Similar News