వైసీపీ అధినేత జగన్ తన నాలెడ్జి పెంచుకోవాలని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించారు. తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తామని చెప్తున్న జగన్ కు అవగాహన లేకే అలా మాట్లాడుతున్నారని... గతంలో మద్య నిషేధం విధించినప్పటి పరిస్థితులు ఏమిటో తెలుసుకుంటే అసలు ఏపీ మద్య నిషేధం సాధ్యమో కాదో జగన్ కే అర్థమవుతుందని డొక్కా అంటున్నారు. ఏపీలో మద్య నిషేధం అసాధ్యమని... జగన్ నోటికేం వస్తే అది మాట్లాడకుండా కాస్త అవగాహన పెంచుకుని మాట్లాడితే బెటరని ఆయన క్లాస్ పీకారు.
ఏపీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం లేదు... విస్తారంగా దొరుకుతోంది. అలాంటప్పుడు ఏపీలో నిషేధం విధించినా ఫలితం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో మద్య నిషేధం విధించినా ప్రజలు తాగడం మానలేదని... సరిహద్దులు దాటి వందల కిలోమీటర్లు వెళ్లి తాగి వచ్చేవారని... పైగా పొరుగు రాష్ట్రాల నుంచి దొంగచాటుగా మద్యం తీసుకొచ్చే ముఠాలు ఊరూరా పెరిగిపోయి కొత్త కష్టాలు వచ్చాయని... అలాగే మద్యంకు బదులు ఎక్కడికక్కడ నాటుసారా - గుడుంబా తయారీ మొదలై ప్రజారోగ్యానికి మరింత ప్రమాదమేర్పడుతుందని డొక్కా అంటున్నారు.
అప్పటి అనుభవాలపై అధ్యయనం చేసి... మద్య నిషేధం అమల్లో ఉన్న ఇతర రాష్ర్టాల్లోని పరిస్థితులూ అధ్యయనం చేసి జగన్ మాట్లాడితే నయమని ఆయన సూచించారు. అంతేకానీ, నోటికి వచ్చినట్లు తోచిందంతా మాట్లాడడం మంచిది కాదని చెప్పారు. మద్య నిషేధంలో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి అప్పుడు మాట్లాడాలని ఆయన జగన్ కు క్లాస్ తీసుకున్నారు. వేరే కార్యక్రమాలేమీ లేకపోవడంతోనే జగన్ ఇలా తెలిసీ తెలియని విషయాలు మాట్లాడుతున్నారంటూ జగన్ అజ్ఞానాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. కాగా జగన్ మద్య నిషేధ ప్రకటనపై సొంత పార్టీలోనూ విమర్శలు, వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అయితే... అందుకు కారణాలు వేరు.