మ‌హారాణి ముందు ట్రంప్ తింగ‌రి ప‌ని!

Update: 2018-07-14 07:27 GMT
ఒక ఊరి ప్రెసిడెంట్ ప‌క్క ఊర్లో పాలేరుకు స‌మాన‌మ‌న్న సామెత అంద‌రికి తెలిసిందే. ఎంత పెద్ద తోపు అయినా ఊరుకాని ఊరు వెళ్లిన‌ప్పుడు ఆచితూచి అన్న‌ట్లుగా ఉండాలి. తొంద‌ర‌పాటుతో వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. కానీ.. ఈ విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పెద్ద త‌ప్పే చేశారంటున్నారు. అస‌లే ట్రంప్‌.. మామూలుగా ఉంటేనే ఆయ‌న్ను వేలెత్తి చూపేవారు.. విమ‌ర్శించే వారికి కొద‌వ ఉండ‌దు. ట్రంప్ అంటేనే పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని బ్రిట‌న్ లో తాజాగా ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న చేసిన చేష్ట ఒక‌టి ఆ దేశ ప్ర‌జ‌ల్ని తీవ్రంగా హ‌ర్ట్ చేసిందంటున్నారు.

ఇంత‌కీ.. ట్రంప్ ఏం చేశార‌న్న‌ది చూస్తే.. బ్రిట‌న్ ప్ర‌ధానితో స‌హా ఆ దేశం యావ‌త్ గౌర‌వించే లండ‌న్ మ‌హారాణి ముందు ఆమెను ఇబ్బంది ప‌ట్టేలా ట్రంప్ వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతున్నారు. శుక్ర‌వారం విండ్ సోర్ క్యాస‌ల్ లో రెడ్ కార్పెట్ మీద ట్రంప్‌.. క్వీన్ ఎలిజ‌బెత్ 2 సైనిక వంద‌నాన్ని స్వీక‌రించారు.

ఆ స‌మ‌యంలో క్వీన్ న‌డుస్తుంటే ఆమెకు ముందుగా ట్రంప్ వెళ్లిపోవ‌టం.. ఆమె కోసం ఆగ‌టం.. ఆమె త‌డ‌బాటుతో ఆయ‌న వైపు రావ‌టం చోటుచేసుకుంది.

మామూలుగా చూస్తే ఇదేమంత పెద్ద విష‌యంగా అనిపించ‌న‌ప్ప‌టికీ.. బ్రిట‌న్ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇది చాలా పే..ద్ద విష‌యంగా మారింది. మా మ‌హారాణి ముందు పెద్ద పెద్దోళ్లే వంగి వంగి ఉంటారు. మ‌హా మ‌హులే మోక‌రిల్లుతారు. అలాంటిది.. నువ్వు మా రాణిని దాటి ముందుకు వెళ‌తావా? అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి ట్రంప్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజా ఉదంతంపై బ్రిట‌న్ పౌరులు ట్రంప్ పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. క‌ట్ చేస్తే.. త‌మ మ‌హారాణి విష‌యంలో బ్రిట‌న్ ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతార‌న్న దానికి ఒక ఉదాహ‌ర‌ణ‌ను ఇక్క‌డ ప్ర‌స్తావించాలి.

1992లో అప్ప‌టి ఆస్ట్రేలియా ప్ర‌ధాని పౌల్ కేటింగ్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఫోటోల‌కు ఫోజులు ఇచ్చే స‌మ‌యంలో మ‌హారాణి  వెన‌కాల చెయ్యేసి ఫోటోలుకు ఫోజులు ఇచ్చారు. అంతే.. ఆయ‌న్ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. త‌మ రాణి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండే బ్రిట‌న్ పౌరులు.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. అందుకు కార‌ణ‌మైన వారిని ఎంత‌కూ ఉపేక్షించ‌రు. తాజాగా ఆ తీరుకు ట్రంప్ ఇప్పుడు బుక్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News