2014లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ ప్రజల్లో లోకల్ సెంటిమెంట్ మరింత బలపడిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా నాన్ అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేయాలని....అక్కడి ఉద్యోగాలన్నీ లోకల్ అమెరికన్లకే రావాలని ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో పలు నిబంధనలను కఠినతరం చేస్తూ వచ్చారు. హెచ్–1బీ వీసా విధానంలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు పవర్స్ పెరిగాయి. తాజాగా, ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని విచక్షణాధికారాలను కల్పిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై హెచ్ 1బీ వీసాలను యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) .....తమ విచక్షణాధికారాల ప్రకారం తిరస్కరించేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
హెచ్ 1బీ వీసా సాయంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటోన్న భారతీయులకు - విదేశీయులకు ట్రంప్ మరో షాకిచ్చారు. హెచ్ 1బీ వీసాల జారీ విషయంలో యూఎస్ సీఐఎస్ అధికారులకు పూర్తి అధికారాలను ఇస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం.... ఇకపై హెచ్ 1బీ వీసాలు - పిటిషన్లు - విజ్ఞప్తులను తక్షణం తిరస్కరించే అధికారం యూఎస్ సీఐఎస్ అధికారులకు ఉంటుంది. వాస్తవానికి - గతంలో హెచ్ 1బీ వీసాల దరఖాస్తులో లోపాలు - తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ ఎఫ్ ఈ) లేదా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై(ఎన్ ఓఐడీ)ను ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసేవారు. ఆ తర్వాత పూర్తి వివరాలతో సమర్పించిన దరఖాస్తును పరిగణలోకి తీసుకునేవారు. అయితే, తాజా నిబంధనల ప్రకారం....హెచ్ 1బీ వీసాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆర్ ఎఫ్ ఈ - ఎన్ ఓఐడీ జారీ చేయకుండానే తిరస్కరించవచ్చు. సెప్టెంబర్ 11 నుంచి తాజా నిబంధనలు అమలు కానున్నాయి.
మరోవైపు, గత నెల 28 నుంచి ట్రంప్ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు హెచ్–1బీ వీసాదారులకు కొత్త చిక్కులు తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరణకు గురైనవారు - వీసాలో ఉన్న గడువు దాటిపోయి ఎక్కువకాలం అమెరికాలో ఉన్నవారు ....దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు లేదా స్టేటస్ మార్పు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా అతను వీసా గడువు తీరిపోయాక అమెరికాలో ఉన్నా ఇబ్బందులు తప్పవు. అటువంటి వారికి ‘నోటీస్ టు అప్పియర్’ (ఎన్టీయే)ను యూఎస్ సీఐఎస్ జారీ చేస్తుంది. దేశ బహిష్కరణ ప్రక్రియలో ఇదే తొలి అడుగు. గతంలో ఈ ఎన్టీయేను నేరం చేసిన వాళ్లకు మాత్రమే జారీ చేసేవారు. అయితే, ఇపుడు హెచ్ 1 బీ విషయంలో కూడా ఈ నిబంధన తేవడం ఆందోళన కలిగిస్తోంది.