వివాదాల కుప్ప అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన మరో సీక్రెట్ రివైల్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు కాక ముందు అతగాడి ఘన కార్యాలకు సంబంధించిన ఈఉదంతం తాజాగా బయటకు వచ్చి సంచలనంగా మారింది. మూడో భార్య మెలానియాతో పెళ్లి తర్వాత చోటు చేసుకున్న ఈ సీక్రెట్ ఎఫైర్ ను ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.
పోర్న్ చిత్రాల్లో నటించే ఒక పోర్న్ స్టార్ తో ట్రంప్ నకు శారీరక సంబంధం ఉందన్న విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడా బయటపెట్టకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని ముట్టచెప్పినట్లుగా సదరు పోర్న్ స్టార్ వెల్లడించింది.
స్టీపానీ క్లిఫార్ట్ అనే పోర్న్ స్టార్ పలు పెద్దల చిత్రాల్లో నటించింది. ఆమె 2006లో జరుగుతున్న ఒక గోల్ఫ్ గేమ్ కు హాజరైంది. దానికి ట్రంప్ హాజరయ్యారు. వీరిద్దరి మధ్య పరిచయం తర్వాతి రోజుల్లో శారీరక సంబంధానికి దారి తీసింది. అప్పటికే ట్రంప్ మెలానియాను మూడో పెళ్లి చేసుకున్నారు.
అయితే.. ఈ విషయం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ దిగే వేళలో.. ట్రంప్ తో తనకున్న శారీరక సంబంధం గురించి క్లీపార్ట్ బయటకు వెల్లడించే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆమె నోటి నుంచి ఈ వివరాలు ఏమీ రాకుండా ఉండేందుకు ట్రంప్ ఒక లాయర్ కు బాధ్యతలు అప్పగించినట్లుగా వాల్ స్ట్రీట్ చెబుతోంది. తన నోటి నుంచి వివరాలేమీ రాకుండా ఉండేందుకు 1.30లక్షల డాలర్లను ముట్టజెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. ఈ వార్తను లాయర్ మైఖేల్ కొట్టిపారేస్తే.. పోర్న్ స్టార్ క్లాపార్డ్ మాత్రం స్పందించలేదు. గతంలో పలువురి మహిళలతో ట్రంప్‌నకు శారీరక సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.