టారిఫ్ కింగ్ అంటూ భార‌త్ పై ట్రంప్ ఎట‌కారం!

Update: 2018-10-02 05:03 GMT
ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. అమెరికా చేసే ప‌నుల‌కు జీ హుజూర్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి భార‌త్ కు మొద‌ట్నించి ఉంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది. దేశ ప్ర‌యోజ‌నాల కంటే కూడా అమెరికా అధ్య‌క్షుడిగా కోపం రాకుండా చూసుకోవ‌టంపైనే భార‌త స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంద‌న్న పేరుంది.

దీనికి త‌గ్గ‌ట్లే ఆగ్ర రాజ్యానికి కోపం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ప్ర‌తి అంశం విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గి అమెరికా ప్ర‌యోజ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. వాద‌న వినిపించ‌టం కామ‌న్ అన్న మాట‌ను ప‌లువురు చెబుతుంటారు. అమెరికా ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి మ‌రింకేమీ ఉంద‌ని అమెరికా అధ్య‌క్షుడి రీతిలోనే.. ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో చెప్పే ప్ర‌య‌త్నాన్ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

అమెరికా ఉత్ప‌త్తుల‌పై అధిక సుంకాలు విధించ‌టం ఏమిటంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ట్రంప్‌.. ప‌నిలో ప‌నిగా భార‌త్ ను టారిఫ్ కింగ్ గా వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. త‌మ ఉత్ప‌త్తుల‌కు అధిక శాతం ప‌న్నులు విధిస్తోన్న భార‌త్‌ను టారిఫ్ కింగ్ గా పేర్కొన‌టం ఒక ఎత్తు అయితే.. అమెరికా మాట‌ల‌కు మోడీ చేత‌ల‌తో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవటాన్ని ప్ర‌స్తావిస్తున్న ట్రంప్‌.. కాసింత అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే.. త‌న‌ను శాటిస్ ఫై చేయ‌టానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తున్న‌ట్లుగా ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా ఉత్ప‌త్తుల‌పై ప‌న్నులు పెంచుతూ భార‌త్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతూ రెండోసారి రియాక్ట్ అయ్యారు. అమెరికా ఉత్ప‌త్తుల‌పై సుంకాలు త‌గ్గిస్తామ‌ని ప్ర‌ధాని మోడీ చెప్పినా ఇప్ప‌టివ‌ర‌కూ ఆచ‌ర‌ణ‌లో ఏమీ జ‌ర‌గ‌లేద‌న్న అసంతృప్తిని ట్రంప్ వ్య‌క్తం చేశారు. మొత్తానికి అమెరికా అధ్య‌క్షుడు కోరుకున్న‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌ధాన‌మంత్రుల జాబితాలో మోడీ పేరును న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. త‌న ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌టానికి మోడీకి ఇంచుమించు తొమ్మిది నెల‌ల ఉన్న వేళ‌.. ట్రంప్ మాట‌ల్ని విని కూడా విన‌న‌ట్లుగా ఉన్న మోడీ.. అదే తీరును కంటిన్యూ చేస్తారా? ట‌్రంప్ మాటల ఒత్తిడికి లొంగుతారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News