రోజుల వ్యవధిలో దాయాది పాకిస్థాన్ కు అగ్రరాజ్యమైన అమెరికాలో చేతిలో మరో భారీ షాక్ పడింది. ఉగ్రవాదులకు స్వర్గదామంగా దేశాన్ని మార్చిన పాక్ కు తాము సైనిక సాయాన్ని అందించలేమని చెప్పి సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు.. మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఉగ్రవాదం విషయంలో పాక్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టిన ట్రంప్ తో పేచీ పెట్టుకున్న పాక్ కు దిమ్మ తిరిగిపోయేలా మరో షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది ట్రంప్ సర్కారు. మొన్నటికి మొన్న పాక్ కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రజకటించిన అమెరికా.. తాజాగా భద్రత సహకారాన్ని కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్‌కు ఈ నిర్ణయం మరింత ఇబ్బంది కలిగించటం ఖాయమని చెబుతున్నారు.
గత 15 ఏళ్లుగా పాక్ కు ఉగ్రవాదంపై పోరుకు తాము సహకారం అందిస్తూ.. పెద్ద ఎత్తున నిధులు అందిస్తుంటే.. పాక్ మాత్రం తమను మోసం చేస్తుందని ట్రంప్ విరుచుకుపడటం తెలిసిందే. ఇందులో భాగంగా 255 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని నిలిపివేశారు.
ఎప్పుడైతే అమెరికా నుంచి నిధుల సాయం నిలిచిపోయిందో.. నాటి నుంచి పాక్ గొంతులో మార్పు వచ్చింది. అగ్రరాజ్య తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ఇదిలా ఉంటే.. భద్రతా పరమైన సాయం కూడా నిలిపివేస్తామని ప్రకటించారు. దీంతో.. భద్రత కోసం పాక్ కు అందే 900 మిలియన్ డాలర్ల భద్రత సహకారం నిలిచిపోయిన పరిస్థితి.
మొత్తంగా చూస్తే.. 1.15 బిలియన్ డాలర్ల సాయం అమెరికా ఆపేసినట్లు అవుతుంది. అఫ్ఘాన్ తాలిబన్.. హక్కాని నెట్ వర్క్ తో సహా పలు ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే వరకూ పాక్ కు ఆర్థిక.. భద్రత పరమైన నిధులు నిలిపివేస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతిని హీతర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. అమెరికా తీరుపై పాక్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అమెరికా నుంచి అందే నిధులు ఒక్కొక్కటిగా నిలిచిపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా తమ పట్ల వ్యవహరిస్తున్న ధోరణిపై నిన్నటి వరకూ ఆ దేశాన్ని నిందించిన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.. ఇప్పుడు భారత్ ను ఈ ఇష్యూలోకి లాగుతున్నారు. ట్రంప్ భారత్ భాషలో మాట్లాడుతున్నారని.. వారి వ్యాఖ్యల్లో నిజం లేదంటూ పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా పేర్కొన్నారు. భారత్.. అమెరికాల మధ్య ఉన్న సంబంధాలతో అమెరికా ఆ దేశ భాష మాట్లాడుతోందన్నారు. అఫ్ఘానిస్తాన్ లో తన ఫెయిల్యూర్ ను కవర్ చేసుకోవటానికే ట్రంప్.. పాకిస్థాన్ ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. చూస్తుంటే.. అమెరికా నుంచి ఆగిన సాయం దెబ్బకు పాక్ నుంచి వస్తున్న రియాక్షన్లు ట్రంప్ ను మరింత మొండివాడిగా మార్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు.