అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వలసదారులపై జూలు విదిలించారు. అధికారం చేపట్టింది మొదలు వలసదారులను టార్గెట్ చేస్తున్న ట్రంప్ నవంబరు 6న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో తన మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ట్రంప్ ‘అక్రమ వలస’ల అంశాన్ని అతి పెద్ద ఎజెండాగా మలచుకున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్దంగా ప్రవేశించినవారికి - అమెరికాయేతరులకు జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో ఈ వర్గాలవారు అమెరికాలో పిల్లల్ని కన్నా వారు ఆ దేశ పౌరులు కారు.
ఇప్పటికే హెచ్1బీ - గ్రీన్ కార్డుల విషయంలో కఠినంగా ఆంక్షలు పెట్టి తాజాగా జన్మతః లభించే హక్కు రద్దుచేస్తే మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకు మంచి ఫలితాలు వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. కాగా ఈ నిర్ణయం ఖరారైతే అది కోర్టుల పరిశీలనకు వెళ్లవచ్చని భావిస్తున్నారు.పలువురు తల్లిదండ్రులు పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో తాత్కాలిక వీసాతో అమెరికాకి వెళ్లి అక్కడే బిడ్డను కంటున్నారు. దీనిపైనే ట్రంప్ కత్తిగట్టి ఇది తీవ్రంగా తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. ``జన్మత పౌరసత్వం ఇచ్చే నిర్ణయం సహేతుకం కానిది. ప్రపంచంలో ఒక్క అమెరికాలో మాత్రమే..ఇక్కడ జన్మనిచ్చినందుకు ఏ వ్యక్తికి అయినా మన పౌరసత్వం ఇస్తున్నాం. తద్వారా వారు 85 ఏళ్ల పాటు మనదేశ ప్రయోజనాలను పొందవచ్చు. ఎంత తప్పుడు చర్య ఇది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. త్వరలో ఇందుకోసం తగిన ఆదేశాలు వస్తాయి`` అని వ్యాఖ్యానించారు. కాగా ఈ పరిణామం ఆ దేశంలో ఉన్న మనోళ్లకు కలవరంగా మారిందని తెలుస్తోంది.
చాలామంది తల్లిదండ్రులు పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో తాత్కాలిక వీసాతో అమెరికాకి వెళ్లి అక్కడే బిడ్డను ప్రసవిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికన్లలో అసంతృఫ్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయానికి సిద్ధమయ్యారు. కాగా, జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణకు ట్రంప్ తీసుకొనే ఏకపక్ష నిర్ణయం కోర్టు విచారణకు దారితీయవచ్చు. అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణ ఆ దేశంలో జన్మించే చిన్నారులకు పౌరసత్వ హక్కును ఇస్తోంది.