ఇన్నాళ్లు ఏమైనట్లుకవిత? ఇప్పుడు ప్రీతి గురించి మాట్లాడటమా?

Update: 2023-02-28 19:35 GMT
కారణం ఏమైతే కానీ.. పీజీ వైద్య విద్యార్థిని అనూహ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం.. విషపు ఇంజక్ష న్ ను తీసుకొని తన జీవితాన్ని ముగించేందుకు ప్రయత్నించిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన సీనియర్ వేధింపులకు తాళలేని ఆమె.. గత్యంతరం లేని పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించారు. ఈ ఉదంతంపై ప్రాంతాలకు అతీతంగా.. వర్గాలకు భిన్నంగా రియాక్షన్ వచ్చింది. ప్రీతి విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు సరైన రీతిలో రియాక్టు కాలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. సోమవారం హన్మకొండలో జరిగిన సభకు హాజరైన మంత్రి కేటీఆర్.. ప్రీతి ఉదంతం గురించి మాట్లాడారు. ప్రీతి మరణానికి కారణమైన సైఫ్ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి బంధువని.. అందుకే అతడి మీద చర్యల విషయంలో వెనుకా ముందు ఆడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో, కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి పెరిగింది. ఇది సరిపోనట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తక్కువగా ఉండటంపై విమర్శలు పెరిగాయి.

దీంతో.. ప్రీతి విషయంలో ప్రభుత్వానికి తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రియాక్టు అయి.. డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ప్రీతి ప్రాణాలు పోవటానికి కారణమైన వారు ఎవరినైనా సరే వదిలేది లేదని.. వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి రియాక్షన్ అనంతరం తాజాగా ఎమ్మెల్సీ కవిత రియాక్టు అయ్యారు. ప్రితి కుటుంబాన్నిప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆమె చెబుతున్నారు.

ప్రీతి ఉదంతం తెర మీదకు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత తొలిసారి స్పందించిన కవిత.. తాజాగా బాధితురాలి కుటుంబానికి లేఖ రాశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పీజీ విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగటాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెప్పిన కవిత.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితులు రాకూడదన్నారు.

ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండటానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతా బాగుంది కానీ.. ఇలాంటి మాటలన్ని ప్రీతి ఉదంతం గురించి వార్తలు వచ్చినంతనే ఎమ్మెల్సీ కవిత ఈ రీతిలో రియాక్టు అయితే బాగుండేది కదా? అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటంలో మర్మమేంది?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News