ఈ నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్టు ఫైట్ ఖాయమైపోయింది. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరు కాకుండా మరో 113 మంది నామినేషన్లు వేసినా అందరి నామినేషన్లను తిరస్కరించారు. 28 నామినేషన్లను ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. మిగిలిన వాటిల్లో కొన్నింటిని నిబంధనలకు తగ్గట్లుగా ప్రపొజర్లు, సపోర్టర్లు లేరని, కొన్నింటిని రు. 15 వేల కాషన్ డిపాజిట్లు కట్టలేదని కొట్టేశారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేయాలంటే ఎంపీలు ప్రపోజ్ చేయాలి. అలాగే మరి కొంతమంది ఎంపీలు సపోర్ట్ చేయాలి. అధికార-ప్రతిపక్షాల తరపున పోటీ చేస్తున్న వారికి ఎంపీల మద్దతు ఎలాగూ ఉంటుంది.
మరి మిగిలిన వ్యక్తుల మాటేమిటి ? దేశంలో ఏదో రంగంలో ఎవరో ప్రముఖుడు రాష్ట్రపతిగా పోటీచేయాలని అనుకుంటారు. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులు పోటీచేయాలని అనుకున్నపుడు మరి వారిని ప్రపోజ్ చేసే, మద్దతు తెలిపే అవకాశం లేదా ?
ఇదే విషయమై ఈ మధ్యనే ఒక వ్యక్తి కేసు వేస్తే ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేసు వేసిన వ్యక్తి వాదన ఏమిటంటే ప్రపోజర్లు, మద్దతుదారులుగా ఎంపీలు మాత్రమే ఉండాలనే నిబంధనను తీసేయాలని. కానీ సదరు వ్యక్తి ఆలోచనలను సుప్రీంకోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. 30 మంది ఎంపీలు ప్రపోజర్లు, మద్దతుదారులుగా దొరకాలంటే రాజకీయేతర వ్యక్తులు పోటీచేయాలంటే మార్గమేంటి ? కచ్చితంగా ఎంపీలు సంతకాలు చేయాల్సిందే అంటే నాన్ పొలిటికల్ వ్యక్తులకు పోటీచేసే అవకాశాన్ని నిరాకరిస్తున్నట్లే.
ఏపీ నుండి తొమ్మిది, తెలంగాణా నుండి మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద చూస్తే మామూలు వ్యక్తులెవరు రాష్ట్రపతిగా పోటీచేసే అవకాశాలు లేవని అర్ధమైపోతోంది. పోటీచేసేందుకు సమానవకాశాలను కల్పించాలని వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. సరే ఏదేమైనా ఈనెల 18వ తేదీన పోలింగ్ జరిగితే 21 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.