డీఆర్డోవో మరో ఘనత.. అగ్రదేశాల సరసన భారత్​

Update: 2020-09-14 14:30 GMT
డీఆర్​డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) సాధించిన ఓ అరుదైన ఘనతతో మనదేశం.. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచింది. ఇంతకూ డీఆర్​డీఏ సాధించిన ఆ ఘనత ఏమిటంటే.. హైపర్​సానిక్​ టెక్నాలజీని ఇటీవల డీఆర్​డీఏ విజయవంతంగా పరీక్షించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలోనే దేశీయంగా అభివృద్ధి చేయనున్నారు. కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేసే ఈ పరీక్షను డీఆర్​డీఏ విజయవంతంగా పూర్తిచేసింది.

ఆయుధాల తయారీలోనూ ముందంజ
ఆయుధాల తయారీలోనూ డీఆర్​డీవో దూసుకుపోతోంది. అత్యంత శక్తివంతమైన లేజర్​లు, అధికశక్తితో కూడిన మైక్రోవేవ్​ వంటి ఆయుధాల తయారు చేసేందుకు కూడా డీఆర్​డీవో ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్​లో ఇవి భారత్​కు కీలక ఆయుధాలుగా మారనున్నాయి.

శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులు, యుద్ధవిమానాలను అడ్డొకొనేందుకు ఓ బలమైన ఆయుధాన్ని రూపొందించేందుకు డీఆర్డీయే యత్నిస్తోంది. ‘ కెమికల్​ ఆక్సిజన్​ అయోడిన్​’ ‘ హైపవర్​ ఫైబర్​’ నుంచి వెలువడే రహస్య లేజర్లతో నడిచే ఓ ఆయుధాన్ని డీఆర్డీఏ తయారు చేయబోతోంది. ఈ ఆయుధం శత్రుదేశాల క్షిపణులను, యుద్ధవిమానాలను తేలికగా అడ్డుకోగలుగుతుందని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రెండు యాంటీ-డ్రోన్ డీఈడబ్ల్యూ వ్యవస్థలను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ... ప్రస్తుతం వీటిని భారీగా ఉత్పత్తిచేయాలని యోచిస్తోంది. రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి ఓ ఆయుధాన్ని డీఆర్​డీఏ రూపొందించబోతోంది. ఈ ఆయుధం 10 కిలోవాట్ల లేజర్‌ సామర్థ్యంతో పనిచేస్తుందని.. ట్రైలర్ మౌంటెడ్ డ్రోన్, కిలోమీటరు పరిధిలోని శత్రువుల లక్ష్యాలను చేరుకునే రెండు కిలోవాట్ల లేజర్‌ కాంపాక్ట్ ట్రైపాడ్-మౌంటెడ్‌ను రూపొందించినట్టు డీఆర్​డీఏ పేర్కొంది.
Tags:    

Similar News