హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రగ్స్ మాఫియా విస్తరించిన తీరు షాక్ కు గురిచేసేలా కనిపిస్తోంది. ఎక్సైజ్ సిట్ అధ్వర్యంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ శుక్రవారం ఓ భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ ఐ) హైదరాబాద్ విభాగం అధికారులు - మెదక్ - నల్గొండ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 5 కోట్లు విలువ చేసే 600 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వీటి విలువ మార్కెట్లో రూ. 12.5 కోట్లు ఉంటుందని డిఆర్ ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారంలో సంబంధమున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
డ్రగ్స్ పై కలకలలో భాగాంగా మెదక్ - నల్గొండ జిల్లాల్లో డిఆర్ ఐ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా భారీ ప్రయోగశాలల్లో మత్తుపదార్థాలను తయారు చేస్తున్నట్టు డిఆర్ ఐ గుర్తించింది. దీంతో ఆయా ల్యాబ్ లను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ల్యాబ్ లు ఏవైనా సంస్థలకు చెందినవా? లేక డ్రగ్స్ ముఠా స్వయంగా నిర్వహిస్తుందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
డ్రగ్స్ రవాణా చేస్తోన్న పలు ముఠాలను తెలంగాణ డిఆర్ ఐ అధికారులు అరెస్టు చేసిన దరిమిలా, కేంద్ర సంస్థలు సైతం దూకుడు పెంచారు. ఇదిలావుండగా ఈ డ్రగ్స్ లో ఎక్కువగా అఫ్రజోలం ఉన్నట్టు మత్తుపదార్థమే ఉందని డిఆర్ ఐ అధికారులు పేర్కొన్నారు.