బ్రెగ్టిట్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతోంది. ఇన్నాళ్లు ఆయా దేశాలకు ఈ కుదుపు ఉండగా ఇపుడు ఇంగ్లిష్ ఆ ఎఫెక్ట్ వచ్చిపడింది. యురోపియన్ యూనియన్ గ్రూప్ నుంచి బ్రిటన్ వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇక ఆ దేశ భాషను కూడా రద్దు చేయాలని ఈయూ దేశాలు భావిస్తున్నాయి. దీంతో ఆంగ్ల భాషకు కష్టకాలం వచ్చిందని చెప్తున్నారు.
యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇంగ్లీష్ భాషదే పైచేయి. ప్రతి వ్యవహారంలోనూ దాదాపు అన్ని ఈయూ దేశాలు ఆ భాషనే వాడుతాయి. కానీ బ్రెగ్జిట్ తర్వాత అధికారిక భాష ఇంగ్లీష్ కు కష్టకాలం వచ్చినట్లు అయ్యింది. మొత్తం 28 సభ్య దేశాల్లో ఇంగ్లీష్ భాషను వాడుతున్నారు. అనేక ఈయూ సంస్థల్లో ఇంగ్లీషే టాప్ ఛాయిస్. అయితే బ్రెగ్జిట్ తో ఆ పరిస్థితి మారనుంది. ఇంగ్లీష్ వాడకాన్ని బహిష్కరించాలని ఈయూ దేశాలు ఆలోచిస్తున్నాయి. ఈయూలో ఉన్న సభ్యదేశాలు తమ అధికార భాషను ఆ సంఘంలో రిజిస్టర్ చేసుకుంటాయి. అలా ఈయూ ఇప్పటికి 23 బాషలను అధికారికంగా గుర్తిస్తుంది. యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాల్లో కేవలం బ్రిటన్ మాత్రమే ఇంగ్లీష్ భాషను అధికారిక భాషగా రిజిస్టర్ చేసుకుంది. ఈయూలో ఉన్న కొన్ని దేశాలు ఇంగ్లీష్‌ను ఎక్కువగా వాడినా బ్రెగ్జిట్ తో ఆ భాష తన అధికారాన్ని కోల్పోనుంది. న్యాయపరంగా ఆలోచిస్తే కూడా ఇంగ్లీష్ ను రద్దు చేయాల్సి ఉంటుందని ఈయూ పార్లమెంట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఇంగ్లీష్ భాషను రద్దు చేయాలని ఇప్పటికే ఫ్రాన్స్ తన డిమాండ్ ను ఈయూ పార్లమెంట్ ముందు పెట్టింది.
ఇదిలాఉండగా బ్రెగ్జిట్ వల్ల యూరోపియన్ యూనియన్ కు వచ్చిన నష్టం ఏమీ లేదనీ, ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందని చాన్సలర్ అంజెలా మార్కెల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జరగనున్న చర్చలలో ఫలాలు పొందాలని బ్రిటన్ ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బ్రిటన్ వైదొలగినా బలంగా సంఘటితంగా కొనసాగే బలం, శక్తి ఈయూకు ఉందని ఆమో అన్నారు. త్వరలో జరగనున్న ఈయూ సభ్య దేశాల సదస్సుకు ముందు జర్మనీ పార్లమెంటులో మాట్లాడిన మార్కెల్ ప్రపంచంలో తన ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు అవసరమైన శక్తి ఈయూకు ఉందని స్పష్టం చేశారు