మాజీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అరెస్ట్‌...

Update: 2020-03-02 11:12 GMT
ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రవికుమార్‌ పై 353,306 రెడ్‌ విత్‌ చ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళను దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రవికుమార్‌ తో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ ఛార్జ్‌ ఈఓపీఆర్‌ డీ గూపపు అప్పలనాయుడును కూన రవికుమార్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారిని కూన బూతులు తిట్టగా...ఆ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్ అయ్యింది. తన అనుచరుడికి సంబంధించిన సమస్యపై అప్పలనాయుడికి కూన ఫోన్ చేశారు. డబ్బులకు సంబంధించిన అంశంపై మాట్లాడారు. తాను ఫోన్‌ ను ఎందకు తీయలేదని బూతు పురాణం అందుకున్నారు. పాతి పెడతాను అంటూ బెదిరింపులకు దిగారు. దీనిపై ఈఓపీఆర్‌ డీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తనపై కుట్ర జరుగుతోందని.. ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతున్నారని కునారవికుమార్ ఆరోపిస్తున్నారు. మరికాసేపట్లో వారిని ఆమదాలవలస కోర్టులో హాజరు పరచనున్నారు.
Tags:    

Similar News