హ్యాక్ అయిన ఫేస్ బుక్‌...5 కోట్ల ఖాతాల‌పై ప్ర‌భావం

Update: 2018-09-29 04:58 GMT
మ‌న‌కు సంబంధించిన వివ‌రాలు.. ఫోటోలు.. అభిప్రాయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మ‌న‌కు సంబంధించిన స‌మాచారం చాలావ‌ర‌కూ ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటాం. ఇలా మ‌నం ఒక్క‌ళ్ల‌మే కాదు.. ఎక్కువ మందిది ఇదే ప‌రిస్థితి. ఫేస్ బుక్ మాత్ర‌మే కాదు.. ఏ సోష‌ల్ మీడియాలోనూ మ‌న‌కు సంబంధించిన స‌మాచారం చాలా.. చాలా త‌క్కువ‌గా మాత్ర‌మే ఇవ్వాల‌న్న విష‌యాన్ని తాజా ఉదంతం మ‌రోసారి నిరూపించింది.

గ‌తంలో మాదిరే.. ఈసారీ ఫేస్ బుక్ హ్యాకింగ్‌ కు గురైంది.  వెబ్ సైట్ లోని ఒక లోపాన్ని వినియోగించుకొని దాదాపు 5 కోట్ల మంది స‌మాచారాన్ని హ్యాక‌ర్లు త‌స్క‌రించి ఉంటార‌న్న విష‌యాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ వెల్ల‌డించారు. వెబ్ సైట్ భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ‌లోని ఒక లోపాన్ని ఆధారంగా చూసుకొని హ్యాక‌ర్లు ఫేస్ బుక్ కు షాకిచ్చారు.

తాజాగా చోటు చేసుకున్న హ్యాకింగ్ కార‌ణంగా దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారుల స‌మాచారం దుర్వినియోగం జ‌రిగి ఉంటుంద‌ని.. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం మ‌రింత అందాల్సి ఉంద‌ని చెబుతున్నారు. హ్యాకింగ్ లో భాగంగా ప్ర‌భావిత‌మైన 5 కోట్ల ఖాతాల స‌మాచారం దుర్వినియోగం అయ్యిందా?  లేదా?  అన్న విష‌యంపై ఇంకా క్లారిటీ లేద‌ని చెబుతున్నారు.

ఈ స‌మ‌స్య తీవ్ర‌మైన‌ద‌ని.. ఇత‌రుల‌కు మ‌న అకౌంట్ ఎలా క‌నిపించేందుకు అవ‌కాశం క‌ల్పించే వ్యూ అజ్ ఫీచ‌ర్ లో లోపం ఉంద‌ని.. దీన్ని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో లోపం ఉన్న ఫీచ‌ర్ ను నిలిపివేశామ‌ని.. ఈ ఫీచ‌ర్ ను ఉప‌యోగించిన 4 కోట్ల ఖాతాల యాక్సెస్ టోకెన్ల‌ను ముంద‌స్తుగా మార్చిన‌ట్లుగా ఫేస్ బుక్ వెల్ల‌డించింది.హ్యాకింగ్ కు సంబంధించిన ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసిన‌ట్లుగా పేర్కొంది. ఫిర్యాదు ఇవ్వ‌టం.. కేసు న‌మోదు కావ‌టం.. నిందితులు ఎవ‌రో తెలుసుకునేందుకు ఆరా తీయ‌టం లాంటి వాటితో జ‌రిగిన న‌ష్టం ఎంత వ‌ర‌కు భ‌ర్తీ చేయ‌గ‌ల‌రన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అందుకే.. సోష‌ల్ మీడియా వేదిక ఏదైనా.. మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని వీలైనంత త‌క్కువ‌గా ఇవ్వ‌టం చాలా ముఖ్య‌మ‌న్న‌ది ఇప్ప‌టికైనా గుర్తించండి.
Tags:    

Similar News