మీ ఫేస్ బుక్ ఖాతాలో మీ కుకీస్ హిస్టరీని బట్టి ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయా? మీరు గోప్యంగా ఉంచుకున్న అభిరుచులను - ఆసక్తులను బట్టి మీకు అడ్వర్టయిజ్ మెంట్ సజెషన్స్ వస్తున్నాయా? దీనంతటికీ కారణం మీ వ్యక్తిగత సమాచారాన్ని మీకు తెలియకుండా తస్కరించడమే. ఈ తరహాలో మీ డేటాను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మీకు తెలియకుండా దొంగలిస్తోంది. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న ఫేస్ బుక్ కు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. స్పెయిన్ కు చెందిన డేటా ప్రొటెక్షన్ సంస్థ....ఫేస్ బుక్ కు1.4 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
ఫేస్ బుక్ ఈ తరహా చర్యలకు పాల్పడడం ఇది మొదటి సారేమి కాదు. తమ దేశ సమాచార పరిరక్షణ నిబంధలను ఉల్లంఘించినందుకు ఫ్రాన్స్‌కు చెందిన డేటా ఏజెన్సీ జరిమానా విధించింది. తమ యూజర్ల డేటాను కాపాడటంలో విఫలమైందని 1,50,000 యూరోలు ఫైన్ వేసింది. అయితే, గతం నుంచి గుణపాఠం నేర్చుకోని ఫేస్ బుక్ అదే తరహాలో స్పెయిన్ లో కూడా డేటా చౌర్యానికి పాల్పడింది. దీంతో, స్పెయిన్ కు చెందిన డేటా ప్రొటెక్షన్ సంస్థ ఫేస్ బుక్ పై చర్యలు తీసుకుంది.
తమ దేశ యూజర్ల డేటాను ప్రకటనకర్తలకు అందుబాటులో లేకుండా నిరోధించడంలో విఫలమైనందుకు ఫేస్‌బుక్‌కు 1.4 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా ఫేస్‌బుక్ వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని ఆ సంస్థ ఆరోపించింది. యూజర్లకు తెలియజేయకుండా వారి వివరాలను ఉపయోగించే హక్కు ఫేస్ బుక్ కు లేదని తేల్చి చెప్పింది.ఫేస్‌బుక్ ప్రైవసీ పాలసీ లోపభూయిష్టంగా ఉందని, అస్పష్ట నిబంధనలతో యూజర్లను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించింది. ఆ పాలసీ యూజర్ల సమాచార సేకరణకు అనువుగా లేదని మండిపడింది. ఇది వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని చెప్పింది. ఇతర దేశాల వారు కూడా తమ ఫేస్ బుక్ యూజర్ల డేటా భద్రతపై దృష్టి సారించాలని సూచించింది.