ఫేస్ బుక్ పాపులారిటీలో మోడీ నంబర్ 1

Update: 2015-12-10 09:57 GMT
 ప్రపంచం సోషల్ మీడియాలో మునిగితేలుతోంది. మెచ్చుకోవడం - నచ్చుకోవడం - పంచుకోవడం - పెంచుకోవడం - తిట్టుకోవడం - కొట్టుకోవడం వంటి సకల అనుభూతులకూ సోషల్ మీడియా వర్చువల్ వేదికవుతోంది. ఈ ఏడాది అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్ల జాబితాను ట్విట్టర్ విడుదల చేసినట్లే ఫేస్ బుక్ కూడా తాజాగా ఈ ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన అంశాలు, వెతికిన పదాలు, వ్యక్తుల జాబితాను రిలీజ్ చేసింది.

ఫేస్ బుక్ భారత ఖాతాదారులు ఈ సైట్లో దేనిపై ఎక్కువగా చర్చించుకుంటున్నారన్న వివరాలను ఫేస్ బుక్ వెల్లడించింది. దాని ప్రకారం ఫేస్ బుక్ ఖాతాదారులు ఎక్కువగా ప్రధాని మోడీ గురించి చర్చించుకున్నారట. ఆయన తరువాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది వ్యక్తులెవరూ కాదు... ఈ కామర్స్ సంస్థలు. అవును ఈకామర్స్ సంస్థలపై చర్చ రెండో ప్లేసులో ఉంది. మూడో ప్లేసులో అబ్దుల్ కలాం ఉండగా, నాలుగో ప్లేసులో బాహుబలి సినిమా ఉంది. నేపాల్ భూకంపం అయిదో స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో సల్మాన్ ఖాన్ కేసు - క్రికెట్ వరల్డ్ కప్ - బీహార్ ఎలక్షన్లు - దీపికా పడుకునే - ఇండియన్ ఆర్మీ ఉన్నాయట.

ఇంటర్నేషనల్ గా ఫేస్ బుక్ లో ప్రముఖంగా నిలిచిన వ్యక్తుల విషయానికొస్తే అమెరికా అధ్యక్షుడు ఒబామాదే అగ్రపీఠం. ఆయన తరువాత స్థానంలో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. నరేంద్రమోడీకి ఈ జాబితాలో తొమ్మిదో స్థానం దక్కింది. ఇండియాలో ఆయన గురించి ఫేస్ బుక్ లో ఎక్కువగా చర్చ జరగ్గా... ప్రపంచవ్యాప్తంగా చూస్తే 9వ స్థానంలో ఉన్నారు. మొత్తానికి రెండు జాబితాల్లోనూ ఆయన టాప్ టెన్ లో ఉన్నారు.
Tags:    

Similar News