ఫేస్ బుక్ తో ప్రపంచం అంతటిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చిన మార్క్ జుకర్ బర్గ్ ఇపుడు మరో కోణంలో తన మార్క్ ను చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫేస్ బుక్ ద్వారా సంపాదించిన పాపులారిటీతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. అదికూడా ఐటీ కంపెనీలకు స్వర్గదామమైన సిలికాన్ వ్యాలీ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 1,500 గృహ సముదాయాలకు జుకర్ బర్గ్ శ్రీకారం చుట్టారు. ఈ ఇళ్లలో 10-15% ఇళ్లు మధ్యతరగతి - దిగువ మధ్య తరగతి వారికి చెందేలా జుకర్ బర్గ్ ప్రణాళికలు రచించారు.
ఇదిలాఉండగా జుకర్ బర్గ్ కు మరో శుభవార్త అందింది. గంట వ్యవధిలోనే 22,000 కోట్ల రూపాయల మేరకు ఆయన ఆస్తులు పెరిగాయి. ఫేస్ బుక్ తన ఖాతాదారులను పెద్ద ఎత్తున పెంచుకుందనే వార్తల నేపథ్యంలో సంస్థ షేర్లకు భారీ స్పందన వచ్చింది. ఫోర్బ్స్ విశ్లేషణ ప్రకారం మొబైల్ రెవెన్యూలో ఫేస్ బుక్ పెద్ద ఎత్తున సొమ్ములు మూటగట్టుకుంది. తాజా అంచనాల నేపథ్యంలో ఫేస్ బుక్ 23% వృద్ధి శాతం నమోదు చేసుకుంది.