ఫేస్ బుక్ లోప్రొఫైల్ గా మార్చొచ్చు

Update: 2015-10-02 23:30 GMT
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలన్న వెంటనే.. ‘‘చైనా.. భారత్’’ అని సమాధానం చెప్పేస్తారు. అదే సమయంలో ఫేస్ బుక్ ను గుర్తుకు తెచ్చుకుంటారు. ఎందుకంటే.. ప్రపంచ జనాభాలోఅత్యధికులు వినియోగించే వాటిలో ఫేస్ బుక్ ఒకటి. ప్రపంచ ప్రజలతో ఇంతలా మమేకమైన ఫేస్ బుక్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తాజాగా తెచ్చిన ఫీచర్ ప్రస్తుతానికి బ్రిటన్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ఏమిటంటే.. ఫేస్ బుక్ పేజీలో మీ ప్రొఫైల్ పిక్ ఉన్న ప్లేస్ లో మీ వీడియోను అప్ లోడ్ చేసే వీలుంటుంది. ఈ సదుపాయాన్ని తాజాగా కల్పించారు. ప్రస్తుతం బ్రిటన్ కు మాత్రమే పరిమితమైన ఈ సదుపాయం.. త్వరలోనే మిగిలిన అన్నీ దేశాలకు అందుబాటులోకి ఫేస్ బుక్ తేనుంది.

మొబైల్ ఫ్రెండ్లీ అప్ డేట్స్ లో భాగంగా ఫేస్ బుక్ తాజా ఫీచర్ ను అందిస్తోంది. జీఐఎఫ్ ఫైల్ ను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయటం ద్వారా.. మీ ప్రొఫైల్ పిక్చర్ కు బదులుగా.. వీడియోను ఉంచుకునే సౌకర్యం లభిస్తుంది. మరిక.. ఆలస్యం ఎందుకు.. మీకు సంబంధించింది కానీ.. మీరు మెచ్చిన వీడియోను సిద్ధం చేసుకుంటే.. ఫేస్ బుక్ ఎప్పుడు అవకాశం కల్పిస్తే.. వెనువెంటనే అప్ లోడ్ చేసేయొచ్చు. మరిక ఆలస్యం ఎందుకు..?


Tags:    

Similar News