కేసీఆర్‌ కు షాక్ ఇవ్వ‌నున్న ఫ‌డ్న‌వీస్‌!

Update: 2019-06-18 09:54 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌ర్థ‌త‌ను ఎవ‌రూ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేరు. శార‌దాపీఠం స్వాములోరు అన్న‌ట్లు.. కేసీఆర్ మ‌హా మేధావి. అయితే.. అలాంటి మేధావికి సైతం కాలం క‌లిసి రాక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. తాజాగా అలాంటి ఇబ్బందినే కేసీఆర్ ఎదుర్కొనున్నారా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది.

ఈ నెల 21న కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపేందుకు వీలుగా కేసీఆర్ భారీ ప్లాన్ వేశారు. అందులో భాగంగా ప్ర‌ధాని మోడీని తీసుకురావాల‌ని భావించారు. అయితే.. ఆయ‌న ప్లాన్ వ‌ర్క్ వుట్ కాలేదు. మోడీకి బ‌దులుగా ప‌క్క‌నున్న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ ను.. పొరుగున ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తానే స్వ‌యంగా ఇన్విటేష‌న్ ఇచ్చి వ‌చ్చారు.

ఈ ఇద్ద‌రుసీఎంలు వ‌స్తే.. ముచ్చ‌ట‌గా ముగ్గురు సీఎంలు క‌లిసి ప్రాజెక్టును ప్రారంభిస్తే.. చూసేందుకు క‌న్నుల పండువ‌గా ఉంటుంద‌న్న కేసీఆర్ ఆలోచ‌న వినేందుకు బాగానే ఉన్నా.. జ‌రిగేది మాత్రం ఇందుకు భిన్న‌మ‌ని అంటున్నారు. ప్ర‌ధాని మోడీతో కేసీఆర్ కు ట‌ర్మ్ బాగోలేని విష‌యం తెలిసిందే. ఇలాంటి వేళ‌లో అధినాయ‌క‌త్వం మూడ్ కు భిన్నంగా మోడీ శిష్యుడు కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి వ‌స్తారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ఫ‌డ్న‌వీస్ రాక‌పోవ‌టానికే ఎక్కువ అవ‌కాశం ఉందంటున్నారు. కేసీఆర్ మీద రాజ‌కీయ దండ‌యాత్ర‌కు బీజేపీ సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ఫ‌డ్న‌వీస్ రాక రెండు పార్టీల మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయ‌న్న భావ‌న క‌లుగ చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. రేపొద్దున కాళేశ్వ‌రం ప్రాజెక్టు ను విమ‌ర్శించాల్సి వ‌చ్చినా.. త‌ప్పు ప‌ట్టాల్సి వ‌చ్చినా.. బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం స్వ‌యంగా వ‌చ్చిన వైనాన్ని రేపొద్దున టీఆర్ఎస్ ప్ర‌శ్నించే అవ‌కాశం ఉన్నందున ఆయ‌న వ‌చ్చే అవ‌కాశం త‌క్కువే అన్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఏమ‌వుతుందో చూడాలి.
Tags:    

Similar News