మహిళలకి ఈ సమాజంలో అసలు రక్షణ అన్నదే కరువైపోతుంది. ఎన్ని చట్టాలు, ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా మహిళలకి సరైన రక్షణ కల్పించలేకపోతున్నారు. అసలు ఇంట్లో నుండి బయటకి వెళ్లిన ఓ ఆడపిల్ల మళ్లీ ఇంటికి వచ్చే వరకు ఒకటే టెంక్షన్. సమాజంలో ఈ తరహా ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ఇక మరి కొన్ని సంఘటనల్లో పిల్లలను కంటి రెప్పలా కాపాడుకొవాల్సిన కన్న తండ్రులే వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా పదవ తరగతి చదివే కన్న కూతురి పై , పరమ పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ కీచక తండ్రి విచక్షణ మరిచి అత్యాచారం చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ... రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణ గౌడ్ వరంగల్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్వస్థలమైన హైదర్ షాకోట్ లోని కపిల నగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని వక్రబుద్ధి బయటకి వచ్చింది. కన్నతండ్రి అన్న పదానికే కలంకం తెచ్చేలా ప్రవర్తించాడు. పదవ తరగతి చదువుకుంటున్న కన్న కూతుర్ని బెదిరించి కామవాంఛ తీర్చుకునేవాడు. ఇక తండ్రి లైంగిక వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నం చేయగా .... అది చూసిన తల్లికూతుర్ని గట్టిగా ఏం జరిగిందో చెప్పాలంటూ నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీనితో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భర్త నుంచి తన కూతురిని రక్షించాలని పోలీసులకు తెలిపింది.