అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచ యుద్ధం గా మారుతుందన్న అంచనాల నేపథ్యంలో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సైనిక చీఫ్ ను అమెరికా దాడి చేసి చంపడం.. తర్వాత ఇరాన్ క్షిపణి దాడుల్లో దాదాపు 80మంది అమెరికా సైనికులు, అధికారులు చనిపోయి నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అమెరికా తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేలా భారత్ పెద్దన్న పాత్ర పోషించాలని.. భారత్ సయోధ్య కోసం ఎలాంటి చర్య చేపట్టినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని తాము స్వాగతిస్తామని భారత్ లోని ఇరాన్ రాయబారి అలీ ఛెగెని ప్రకటించారు.
న్యూఢిల్లీ లోని ఇరాన్ రాయబార కార్యాలయం లో మరణించిన ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమనికి ఆయన నివాళులర్పించారు. అనంతరం అలీ ఛెగని మాట్లాడుతూ అమెరికా స్థావరాల పై క్షిపణి దాడులను సమర్థించుకున్నారు. ఇది ఆత్మరక్షణ కోసం చేసిన దాడియేనని స్పష్టం చేశారు. తమను తాము కాపాడుకోవడం యుద్ధంగా భావించరాదన్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి భారత్ ఎలాంటి సయోధ్య కుదిర్చినా తాము స్వాగతిస్తామని పాటిస్తామని ఆయన ప్రకటించారు. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.