ఏపీలో తుదిదశ పోలింగ్.. గుంటూరులో బాహాబాహీ!

Update: 2021-02-21 10:43 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పంచాయ‌తీ ఎన్నిక‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. చివరిదైన నాలుగో దశలో 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 3,299 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో 554 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

దీంతో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 7,475 మంది బరిలో నిలిచారు. ఇక వార్డుల విషయానికి వస్తే.. 33,435 వార్డులకుగానూ 10,921 వార్డులు ఏకగ్రీవమైనట్టు అధికారులు వెల్లడించారు. మిగిలిన 22,423 వార్డులకు ఎన్నిక జరగ్గా.. 52,700 మంది పోటీపడ్డారు.

కాగా.. తుది దశ పోలింగ్ సమయంలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో ఘర్షలు తలెత్తాయి. ధూళిపాళ్లలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. దీంతో పలువురు ఏజెంట్లకు గాయాలయ్యాయి.

అదేవిధంగా.. లక్కరాజు గార్లపాడు గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. అదేవిధంగా ఫణిదంలోనూ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.




Tags:    

Similar News