పదో త‌ర‌గ‌తి పాస్ కాలేదా..పైలెట్ అయిపోవ‌చ్చు

Update: 2019-01-01 06:22 GMT
పాకిస్థాన్‌ లో చోటుచేసుకునే అనేకానేక చిత్రాల్లో తారాస్థాయికి చేరుకున్న అంశం ఇది. ఘ‌న‌త వ‌హించిన పాక్ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ఎలా గాల్లో క‌లిపేస్తోందో తెలిపేది ఇది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ లైన్స్ (పీఏఐ)లో పైలట్లుగా సేవలందిస్తున్న వారిలో ఐదుగురు వ్యక్తులు కనీసం పదో తరగతి కూడా ఉత్తీర్ణులు కాలేదు. ఏడుగురు పైలట్ల సర్టిఫికెట్లు బోగస్‌వని తమ నిర్దారణలో తేలిందని సుప్రీంకోర్టుకు పాక్ విమానయాన సంస్థ తెలిపింది. ధ్రువ పత్రాలను సమర్పించని 50 మంది పైలట్లను సస్పెండ్ చేసినట్లు చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిస్సార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి పీఏఐ నివేదించిందని డాన్ న్యూస్ ఒక వార్తాకథనం ప్రచురించింది.

జస్టిస్ ఇజాజుల్ ఎహసాన్ మాట్లాడుతూ పదో తరగతి కూడా చదవని వ్యక్తి కనీసం బస్సు కూడా నడుపలేరని - కానీ వీరు మాత్రం విమానాలను నడుపుతూ ప్రయాణికుల జీవితాలను ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పీఏఐలోని పైలట్లు ఇతర సిబ్బంది డిగ్రీలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. పీఏఐలో 4,321 మంది ఉద్యోగుల రికార్డుల్లో 402 మంది మాత్రమే పెండింగ్‌ లో ఉన్నాయి. 498 మంది పైలట్ల లైసెన్స్ పరీక్షా ఫలితాల జాబితాను సమర్పించాలని పీఐఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత జూన్ నాటికి పీఏఐ నష్టాలు రూ.36వేల కోట్లకు చేరుకున్నాయి.


Full View


Tags:    

Similar News