షిరిడీ సాయిబాబా భక్తులకు శుభవార్త. వచ్చే నెల నుంచి షిరిడీకి విమాన సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏడీసీ) ఈ ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలు చూసుకోనుంది. ముంబై - ఢిల్లీ - హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమానాలు నడపనున్నారు. 2002లో ఏర్పాటైన తర్వాత ఎంఏడీసీ అభివృద్ధి చేసిన తొలి ఎయిర్‌పోర్ట్ ఇదే. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి దేశీయంగానే విమానాలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానాలు నడిపే ఆలోచన ఉన్నట్లు ఎంఏడీసీ సీఎండీ విశ్వాస్ పాటిల్ తెలిపారు.
ఈ ఎయిర్ పోర్ట్ కోసం పౌర విమానయానశాఖ రూ.340 కోట్లు కేటాయించింది. రోజుకు నాలుగు నుంచి ఐదు విమానాలు ల్యాండ్ - టేకాఫ్ అయ్యే ఏర్పాట్లు చేశామని పాటిల్ చెప్పారు. ప్రస్తుతానికి హైదరాబాద్-షిరిడీ - ఢిల్లీ-షిరిడీ - ముంబై-షిరిడీ విమానాలు నడుపుతామని, తర్వాత మిగతా నగరాలకు కూడా విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో విమాన సేవలు ప్రారంభం కావడం భక్తులకు ఊరట కలిగించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/