టీడీపీ దుకాణం ఖాళీ అయ్యేలానే ఉంది. ఇప్పటికే టీడీపీ నేతలు బీజేపీ, వైసీపీ బాట పట్టిన సంగతి తెలిసిందే.. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన కొందరు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొండ్రు మురళీ అధికార వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలిసింది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు కొండ్రు మురళీ మద్దతు తెలిపి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటీవలే షాకిచ్చారు. తాజాగా వైసీపీలో చేరేందుకు కీలక నేత విజయసాయిరెడ్డితో సంప్రదింపులు సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మురళీతోపాటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీలో చేరికకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలిసింది.
వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కొండ్రు మురళి.. ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఏకంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి టీడీపీ కార్యకమాలకు దూరంగా ఉంటున్న మురళి ఇటీవలే విశాఖ రాజధాని ఏర్పాటుపై జగన్ చేసిన ప్రకటనకు మద్దతు ఇచ్చారు. ఈ పరిణామం టీడీపీకి శరాఘాతంగా మారింది. తాజాగా వైసీపీలో చేరేందుకు మురళీ రెడీ అవుతున్నట్లు తెలిసింది.