కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులుగా పోల్చిన కంగనా.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ రైతుల నిరసనకు సపోర్ట్ చేసేవారిపై వ్యగ్యంగా ట్వీట్స్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కంగనా నటిస్తోన్న ‘ధకాడ్’ చిత్రీకరణ మధ్యప్రదేశ్ లో జరుగుతుండగా.. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సెట్స్ వద్ద ఆందోళనలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని తనకు భద్రత పెంచారని కంగనా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుఖ్ దేవ్ పాన్సే ఆధ్వర్యంలో గురువారం ర్యాలీని చేపట్టి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పాన్సే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రభుత్వాలు మారినంత మాత్రాన పోలీసులు కంగనాకు తోలుబొమ్మలా వ్యవహరించకూడదు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల చర్యపై న్యాయమైన దర్యాప్తు జరగాలి. దర్యాప్తు పూర్తయ్యే వరకు మా పార్టీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు" అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కంగనాను ఉద్దేస్తూ 'నాచ్నీ గానే వాలి' అని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.