రాజకీయ నేతలు ఒకే పార్టీలో ఉండాలి అనుకోవడం ..అప్పుడే కాళ్ళు వస్తున్న పిల్లలు ఒకే దగ్గర కూర్చొని ఆడుకోవడం జరగవు. రాజకీయ నేతలు చొక్కా మార్చినంత ఈజీ గా పార్టీ జెండా పరుస్తారు. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఒకే పార్టీలో ఉంటే మాకు ఏంటి లాభం అని అనుకుంటారో ఏమో కానీ .. ఏ వానకి ఆ గొడుగు పడ్డటం లో రాజకీయ నాయకులని మించిన వారు ఎవరు ఉండరు. రంగులు మార్చె ఊసరవెల్లి కూడా తనకి ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే ఇంకో రంగులోకి మారిపోతుంది. కానీ , కొంతమంది రాజకీయ నేతలు మాత్రం .. అధికారమే ద్యేయంగా పార్టీలని మారుస్తుంటారు. కాకపోతే ఇలాంటి వారికే ప్రజామద్దతు ఉండటం గమనార్హం.
ఏపీలో ప్రస్తుతం వలసల రాజకీయం మొదలైంది. టీడీపీ ఘోరంగా ఓడిపోవడం తో ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఇప్పటికే బీజేపీ లోకి వెళ్లి పోయారు. తాజాగా మరో మాజీ మంత్రి కమలం తో దోస్తీ కట్టడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో ..కాదు గంటా శ్రీనివాస్ రావు. ఆయన రూటే సెపరేటు అని చెప్పాలి. గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం తర్వాత మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. ఈ మద్యే జరిగిన ఎన్నికలలో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు.
కానీ , పార్టీ అధికారంలోకి రాక పోవడంతో గంటా పార్టీ మారుతారని ఆరునెలల నుంచి ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఒకసారి వైసీపీలో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీడీపీ సర్వసభ్య సమావేశానికి కూడా గంటా హాజరుకాకపోవడంతో పార్టీలో ఆయన మీద టీడీపీ నేతల్లో డౌట్లు మొదలయ్యాయి. గంటా శ్రీనివాస్ రావు తొలుత బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కొన్ని రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ భేటీలోనే ఆయన బిజెపిలో చేరడం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లు సమాచారం. అయితే.. ఇద్దరి మధ్య భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, గంటా వ్యక్తిగత డిమాండ్లకు సంబంధించి పెద్ద చర్చనే జరిగినట్లు తెలుస్తోంది. అలాగే మంగళ, బుధవారాల్లో ఏపీ బిజెపి నేతలు కూడా దీనిపై సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.
ఇక నవంబర్ 10 లేదా 11 తేదీలలో APకి రానున్న బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డాతో రాష్ట్ర బిజెపి నేతలు గంటా వ్యవహారం పై చర్చించనున్నారు. రాం మాధవ్‌తో జరిగిన భేటీ , తాజాగా జరిగిన భేటీలో చర్చకి వచ్చిన విషయాలని ఆయనకి వివరించనున్నారు. ఆ తరువాత జె.పి. నడ్డా గంటా పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దానికి గంటా సముఖత వ్యక్తం చేస్తే .. వారం, పదిరోజుల్లో బిజెపి చీఫ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో గంటా శ్రీనివాస్ రావు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే గంటా మరో పదిరోజుల్లో బీజేపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.