ఎప్పుడూ లేని విధంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు సంబంధించిన వార్తలు మీడియాలో ఈ మధ్యన కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి. అయితే.. దీనికి కారణం లేకపోలేదు. మరికొద్ది రోజుల్లో ఆయన తాజాగా నటించిన బ్రహ్మోత్సం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి తోడు.. తాను దత్తత తీసుకున్న గ్రామాలకు పర్యటించటం.. ఆ సందర్భంగా ఆయన రాజకీయ పార్టీల నేతలతో పూసుకురాసుకొని తిరగటంతో సహజంగా మహేశ్ మీద అందరి కన్నుపడిందని చెప్పక తప్పదు.
తన బావ.. గుంటూరుఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి తన తండ్రి సొంతూరైన బుర్రిపాలెంకు మహేశ్ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ వెలిసిన ప్లెక్సీలు రాజకీయ వర్గాల్ని ఆకర్షించాయని చెప్పాలి. దీంతో.. మహేశ్ ను సెంటర్ చేస్తూ దానికి గల్లాను యాడ్ చేసి.. పాలిటిక్స్ లోకి మహేశ్ ను లాగుతూ కొన్ని వార్తలు తెర మీదకు వచ్చాయి. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. తన పనేంటో తాను అన్నట్లుగా వ్యవహరించే మహేశ్ బాబు తన మీద వస్తున్న వార్తల పట్ల రియాక్ట్ అయ్యారు. తాజాగా బ్రహ్మోత్సవం ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆయన.. తనను పాలిటిక్స్ తో కలిపి వేసిన ప్రశ్నకు చటుక్కున స్పందించారు. బుర్రిపాలెంను దత్తత తీసుకోవటానికి బావ అయిన ఎంపీ గల్లా సపోర్ట్ చేసినట్లు ఉందే అన్న ప్రశ్నకు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో తన బావ గల్లాతో తనకు లింకెడుతూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తూ.. తాను మొదటి నుంచి చెప్పినట్లే రాజకీయాలకు దూరమని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎన్నికల్లో గల్లా జయదేవ్ కు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. ప్రజల కోసం పోరాడే తత్వం ఉన్న గల్లా జయదేవ్ కు తన సాయం అవసరం ఉండదని చెప్పటం విశేషం. బావకు తన అవసరం లేదంటున్న బావమరిది మాటలకు గల్లా జయదేవ్ ఎలా రియాక్ట్ అవుతారో..?