జొమాటో .. ఈ పేరు తెలియని వారు ఇప్పుడు ఎవరు ఉండరు. ఫుడ్ కావాలంటే ఓ చిన్న క్లిక్ చేస్తే, క్షణాల్లో ఇంటి డోర్ ముందుకి నచ్చిన ఫుడ్ వచ్చేసింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడైన గౌరవ్ గుప్తా బయటికొచ్చేసినట్టు సమాచారం. కారణాలు తెలియదు గానీ..గుప్తా అవుట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పూర్తి కారణాలు తెలియకపోయినా.. గుప్తా సడెన్ గా కంపెనీ నుంచి నిష్క్రమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జొమాటో అతిపెద్ద ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన గౌరవ్ గుప్తా కంపెనీని పెట్టాలని నిర్ణయించుకున్నానని,అందుకు రాజీనామా చేస్తున్నట్లు ఉద్యోగులకు మంగళవారం లేఖ రాశారు.
జాతీయ మీడియాలో ఇదే విషయంపై కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో జొమాటో షేర్లు స్వల్పంగా పతనం కావడం గమనార్హం. జొమాటో సంస్థలో కీలక నిర్ణయాల్నించి మొదలుకుని ఐపీవోకు వెళ్లడం, ఇన్వెస్టర్లతో చర్చలు, మీడియాతో ఇంటెరాక్షన్ వంటి వ్యవహారాలన్నీ గౌరవ్ గుప్తానే చూసుకుంటూ వచ్చారు. జొమాటో ఐపీవోకు వెళ్లిన 2 నెలల తరువాత నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ తరుణంలో గౌరవ్ గుప్తా బయటకు వచ్చేయడం చర్చనీయాంశమైంది. అసలు గౌరవ్ గుప్తా జొమాటో నుంచి ఎందుకు బయటికొచ్చారనేది కచ్చితంగా ఇంకా తెలియలేదు.
ఇవాళ జొమాటోలో ఆయనకు చివరి వర్కింగ్ డేగా తెలుస్తోంది. ఆరేళ్ల జొమాటో తన ప్రయాణం ముగిసిందని..కొత్త జర్నీ ప్రారంభించబోతున్నట్టుగా అంతర్గతంగా ఉద్యోగులకు మెయిల్ చేసినట్టుగా ఓ ప్రకటన వైరల్ అవుతోంది. వాస్తవానికి నిత్యావసర వస్తువుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాలు గౌరవ్ ఐడియాలే. అటు ఓవర్సీస్ లో జొమాటో విస్తరణ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2015లో జొమాటోలో చేరిన గౌరవ్ గుప్తా 2018 నుంచి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. 2019లో జొమాటోలో ఫౌండర్ హోదా దక్కింది.