కరోనా: ప్రజలకు ఆర్థిక సాయమెలా.. మనస్థాపంతో ఆర్థికమంత్రి ఆత్మహత్య

Update: 2020-03-30 03:15 GMT
కరోనా మహమ్మారి వల్ల కొంతమంది సామాన్యులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ జర్మనీ లో ఏకంగా ఆర్థికమంత్రి సూసైడ్ చేసుకున్నారు. కరోనా కారణంగా భవిష్యత్తు లో సంభవించే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోననే ఆందోళన తో జర్మన్ హెస్సీ రాష్ట్ర ఆర్థికమంత్రి థామస్ షాపెర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయస్సు 54. హోచ్చెమ్ రైల్వే ట్రాక్ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది.

ఇతను జర్మన్ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్‌ కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ పార్టీకి చెందిన నాయకుడు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. పదేళ్లుగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు స్టేట్ గవర్నర్ బౌఫిర్ వెల్లడించారు.

తామంతా షాక్‌ లో ఉన్నామని, కరోనా మహమ్మారి దాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంపెనీలు, కార్మికులకు అండగా నిలవడానికి ఆయన పగలు రాత్రి శ్రమించారని, ఇలాంటి సమయంలో ఆయన అవసరం తమకు ఎంతో ఉందని బౌఫిర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఆర్థిక సాయం గురించి ఆయన రాష్ట్ర ప్రజలకు సమాచారం అందించారన్నారు. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉంది. అతని మృతదేహం ఫ్రాంక్‌ఫర్ట్ సమీపంలోని హోచ్చెమ్ రైల్వే ట్రాక్ సమీపంలో లభ్యమైంది.

బౌఫిర్‌కు థామస్ షాపెర్ వారసుడిగా చాలమంది భావించారు. 2023లో ఆయన పోటీకి దూరంగా ఉంటే థామస ప్రీమియర్ అవుతారని భావించారు. ఆర్థిక సాయం పట్ల ప్రజల్లో తీవ్రమైన అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవడమెలా అనే ఆందోళనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.
Tags:    

Similar News