ఎంతైనా కేటీఆర్ యూత్. ఆయనకు తగ్గట్లే ఆయన అనుచరగణం వినూత్న రీతిలో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు. మరో రోజులో (బుధవారం) టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న సేవా కార్యక్రమాల్ని చేపట్టారు.
బొకేలు.. ఫ్లెక్సీలు.. పూలదండలతో డబ్బుల్ని వృధా చేయొద్దని.. అవసరమైన వారిని తోచినంత సాయం చేయాలన్న కాన్సెప్ట్ తో ఈ ఛాలెంజ్ ను నిర్వహిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే స్పందిస్తున్న కేటీఆర్ అభిమానుల్లో కొందరు అంబులెన్స్ కు రూ.10 లక్షలు ఇస్తే.. దివ్యాంగుడికి కృత్రిమ కాలును మరొకరు సమకూర్చారు.
ఇక ఎన్ ఆర్ ఐలు కొందరు స్పందించి అమెరికన్ కేన్సర్ సొసైటీకి 250 డాలర్లు విరాళంగా ఇచ్చారు. అంధుల పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులు.. సరుకులు.. అనాథ.. వృద్ధాశ్రమాలలో భోజనాల పంపిణీ.. రక్తదానం.. ప్రభుత్వ పాఠశాలలు.. ఆసుపత్రులలో మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లను ఇలా.. చాలానే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
అంతా బాగానే ఉంది.. పనిలో పనిగా ఈ ఛాలెంజ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎవరైనా నామినేట్ చేస్తే బాగుంటుంది కదా. కనీసం.. ఈ ఛాలెంజ్ లో భాగంగా అయినా.. ఇప్పటికే భర్తీ చేయాల్సిన మంత్రి పదవుల్ని.. పలు నామినేట్ పదవుల్ని భర్తీ చేసి.. తన ఛాలెంజ్ ను పూర్తి చేస్తారేమో? అదే జరిగితే.. గులాబీ నేతలకు కేటీఆర్ పుట్టినరోజు నిజమైన పండుగగా మారటం ఖాయం. ఛాలెంజ్ కు నామినేట్ చేస్తే.. ఆషాఢమాసంలో స్వీకరించనంటే ఎలా? అన్న డౌట్ అక్కర్లేదు.. కొడుకు పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించేది కాబట్టి.. మినహాయింపు ఇస్తారేమో. ఇంతకీ సారును నామినేట్ చేసే సాహసవంతుడెవరంటారు?