ప్రపంచం కాలుష్యం బారినపడుతోంది. ఇప్పుడు కాలుష్యమే ప్రధాన ఎజెండాగా మారింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ దేశాలు 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీన్ని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐరాస అంతర్ ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) సోమవారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచ ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడెక్కుతుందని.. ఇది పారిస్ ఒప్పందం లక్ష్యం కంటే రెండు రెట్లు అధికమని అప్రమత్తం చేసింది. ఈ మార్పులు భూమిపై ఉన్న సమాజాలు, వ్యక్తుల జీవితాలను దుర్భరంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
జీరో ఉద్గారాల హామీ ఆధారంగా ఐపీసీసీ తాజా నివేదికను రూపొందించారు. కర్బన్ ఉద్గారాలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 2021లో విడుదల చేసిన నివేదికలోనూ ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని.. తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలం కూడా ఉండదని హెచ్చరించారు.
సాంకేతికత, పరిజ్ఞానం, సంపద సాయంతో భవిష్యత్తులో నివాసయోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఉష్ణోగ్రతలను తగ్గించడానికి సమయం చాలా తక్కువగా ఉంది. లక్ష్యాన్ని సజీవంగా ఉంచడానికి తప్పనిసరిగా 2025కి ముందే గరిష్ట స్థాయికి చేరుకోవాలని ఐపీసీసీ శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు.
గత నవంబరులో గ్లాస్గో వాతావరణ సదస్సుకు ముందు 2023 నాటికి కర్బన్ ఉద్గారాలు తగ్గింపుపై చేసిన వాగ్ధానాల ప్రకారం .. 21వ శతాబ్ధంలో ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ ను మించిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇది పారిస్ ఒప్పందం మొదటి లక్ష్యాన్ని కోల్పేయేలా చేసిందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ జీడీపీ ప్రస్తుతం కంటే 2050లో కొంత మేర తగ్గుతుందని.. వాతావరణ నష్ట నివారణ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోదని పేర్కొన్నారు.