తమిళనాడుకు వెళుతున్నారా? కాస్తంత జాగ్రత్త.. వణికిస్తున్న మద్రాస్ ఐ

Update: 2022-11-22 03:29 GMT
మద్రాస్ ఐ అన్నంతనే కొందరికి ఇట్టే అర్థమైతే.. మరికొందరికి మాత్రం అలాంటి అస్సలు అర్థం కాదు. మరో విధంగా చెప్పాలంటే.. కళ్ల కలక. అదేనండి.. కళ్లు మొత్తం ఎర్రగా అయిపోయి.. కుంకుడుకాయ నీళ్లు కంట్లో పడితే ఎలా అయితే నొప్పి పుడుతుందో.. సేమ్ టు సేమ్ అలానే ఉండటంతో పాటు.. తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు ఇది వస్తుంది? అన్న దాని మీద స్పష్టంగా చెప్పలేరు కానీ.. ఒకరికి వస్తే మాత్రం.. ఆ వెంటనే అందరిని చుట్టేసే వైరస్ గా మాత్రం దీన్ని చెప్పొచ్చు.

ఈ వైరస్ బారిన పడినోళ్లు ఇబ్బందులకు గురవుతుంటారు. ప్రస్తుతం ఈ వైరస్ తమిళనాడులో వేగంగా వ్యాపిస్తోంది. దీంతో.. తమ కళ్లను చూపించుకోవటం కోసం ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.ఇప్పుడున్న అంచనా ప్రకారం ప్రతి పది మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు ఈ వైరస్ తో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. నిజానికి దీనికి మద్రాస్ ఐ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలీదు. కానీ.. ఇది వచ్చిన వారి నుంచి వేరే వారికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఎంతో జాగ్రత్త తీసుకుంటే తప్పించి.. దీని బారిన పడకుండా ఉండని పరిస్థితి.

ఈ వైరస్ బారిన పడినోళ్ల కళ్ల నుంచి నీరు బయటకు రావటం.. పుసి కట్టటం.. కళ్లు మంటలు.. కళ్లను ఏదో గుచ్చేసినట్లుగా ఉండటం.. కళ్లు ఎర్రగా మారటం.. మరికొందరికి కళ్లుకాస్తంత ఉబ్బటం లాంటివి జరుగుతుంటాయి.

ఈ ఇన్ ఫెక్షన్ బారిన పడినోళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని బారిన పడినోళ్లు తమ కళ్లను చేతులతో తగిలించకూడదు. ఒకవేళ అలా చేస్తే మరే వస్తువును పట్టుకోకుండా నీటితోచేతుల్నిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. దీని బారిన పడిన వాళ్లు తమ వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని  చెబుతున్నారు.

అంతేకాదు.. కళ్లకు రక్షణగా నల్లటి కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిది. ఎండ సూటిగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. ఈ ఇన్ ఫెక్షన్ తో ఇబ్బంది పడే వారికి దూరంగా ఉంటూ.. ఇది మరింత వ్యాపించకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి ఇబ్బంది పడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు చెన్నైకి వెళ్లాల్సిన ఉన్నా.. అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నా కాసింత కేర్ ఫుల్ గా ఉండాల్సిందే. ఇది ఒకసారి వస్తే కనీసం మూడు నాలుగురోజుల పాటు ఇబ్బందులకు గరి అవుతారని చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News