కన్‌ ఫర్మ్‌ - హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆయనే

Update: 2019-03-25 13:55 GMT
 హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ విషయంలో సినిమాలకు మించిన ట్విస్ట్‌ లు  జరిగాయి. అయితే.. అంతిమంగా నిజమే గెలుస్తుంది అన్న నానుడిలా గోరంట్ల మాధవే గెలిచారు. ఆయన హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. జేసీ దివాకర్‌ రెడ్డిపై మీసం తిప్పిన విషయంలో గోరంట్ల మాధవ్‌ డేర్‌నెస్‌ వైఎస్‌ జగన్‌ కు బాగా నచ్చింది. అందుకే పిలిచి మరీ హిందూపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అన్నింటికి మించి గోరంట్ల మాధవ్‌ కురుబ కులానికి చెందిన వ్యక్తి. హిందూపురం కురుబ కులానిదే డామినేషన్‌. దీంతో  ఆయన గెలుపు నల్లేరు మీద నడకే. అయితే.. ఇక్కడ ఆయన్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రభుత్వం పావులు కదిపింది. గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనపై ఉన్న మెమోల కారణంగా వీఆర్‌ ఎస్‌ ఇచ్చేందుకు లేట్‌ చేసింది. ఈలోపుగా ఎన్నికల నామినేషన్‌కు గడువు పూర్తవుతుండడంతో.. మాధవ్‌ హైకోర్టుని ఆశ్రయించారు. ఈలోపుగా ఎందుకైనా మంచిదని.. వైసీపి రెండు బీ ఫారాలు ఇచ్చింది. ఒకటి మాధవ్‌ కి - ఇంకోటి ఆయన భార్య సవితకు. అయితే కోర్టులో వాదనలు విన్న ధర్నాసనం.. మాధవ్‌ పోటీ చెయ్యేచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో  హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మాధవ్‌.

ప్రస్తుతం హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్‌ - ఆయన భార్య సవిత ఇద్దరూ నామినేషన్ వేశారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 28వరకు ఉంది కాబట్టి ఈలోపుగా ఆయన భార్య తన నామినేషన్‌ ని ఉపసంహరించుకుంటారు. ఫైనల్‌ గా బరిలో వైసీపీ తరపు నుంచి గోరంట్ల మాధవ్‌ ఒక్కడే నిలబడతాడు.


Tags:    

Similar News